Nippatlu: నిప్పట్లు రుచి చూశారా? సింపుల్ టీ టైం స్నాక్ రెసిపీ

Best Web Hosting Provider In India 2024


మనం చేసుకునే బియ్యంపిండి గారెలు లేదా అప్పాలకు కాస్త దగ్గరగా ఉంటాయి ఈ నిప్పట్లు. ఇది కర్ణాటకలో ఎక్కువగా చేసే వంటకం. వీటి రుచి మాత్రం అదిరిపోతుంది. టీ టైంలో మంచి స్నాక్ ఇది. దీని తయారీ ఎలాగో చూసేయండి.

నిప్పట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల బియ్యం పిండి

సగం కప్పు పల్లీలు

సగం కప్పు పుట్నాలు

పావు కప్పు సన్నం రవ్వ

అర చెంచా జీలకర్ర

1 కరివేపాకు రెమ్మ

డీప్ ఫ్రై కోసం సరిపడా నూనె

2 చెంచాల మైదా

4 చెంచాల నువ్వులు

చిటికెడు ఇంగువ

తగినంత ఉప్పు

అరచెంచా కారం

నిప్పట్టు తయారీ విధానం:

  1. ముందుగా మిక్సీ జార్‌లో పల్లీలు, పుట్నాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కాస్త బరకగానే ఉండేట్లు చూసుకోంి.
  2. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో బియ్యం పిండి, మైదా, రవ్వ వేసుకోండి. అందులోనే ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసి ఒకసారి కలపండి.
  3. ఇప్పుడు నువ్వులు, ఇంగువ, కరివేపాకు తరుగు, ఉప్పు, కారం కూడా వేసి పొడిగానే ఒకసారి అన్నీ కలపండి.
  4. ఒక చిన్న పాత్ర స్టవ్ మీద పెట్టుకుని అందులో మూడు చెంచాల నూనె వేసుకోండి. దాన్ని కాస్త వేడి చేసి పైన పిండి మిశ్రమంలో పోసేయండి.
  5. అన్నీ బాగా కలుపుకోండి. చేత్తో ముద్ద కట్టినట్లు చేస్తే పిండి కాస్త ఆగాలి.
  6. ఇప్పుడు పావు కప్పు దాకా నీళ్లు పోసి పిండిని బాగా కలపుకోండి. ఒకేసారి అన్ని నీళ్లు పోసేయకండి. చేతికి అంటుకోకుండా పిండి తయారైతే చాలు.
  7. ఇప్పుడు పూరీ ప్రెస్ సాయంతో లేదా చపాతీ కర్రతో చిన్న చిన్న గారెల్లాగా ఒత్తుకోండి.
  8. కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోండి. అది వేడెక్కగానే అందులో ఒక్కో అప్పం వేసుకోండి. మీడయిం మంట మీద ఫ్రై చేస్తే అర నిమిషంలోనే రంగు మారి క్రిస్పీగా అయిపోతాయి. వాటిని పక్కన తీసుకుంటే నిప్పట్లు రెడీ అయినట్లే.

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024