Group 1 Mains Hall Tickets : గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024


గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. https://hallticket.tspsc.gov.in ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేస్తే.. పీడీఎఫ్ ఫార్మాట్‌లో హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతోంది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్‌లో భాగంగా ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పేపర్‌ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31 వేల 382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి.

పరీక్షల షెడ్యూల్..

జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) – అక్టోబర్ 21, 2024.

పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.

పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) – అక్టోబర్ 23, 2024.

పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) – అక్టోబర్ 24, 2024.

పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) – అక్టోబర్ 25, 2024.

పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) – అక్టోబ్ 26, 2024.

పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) – అక్టోబర్ 27, 2024.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. అభ్యర్థులకు అవగాహన కోసం వెబ్ సైట్ లో మోడల్ ఆన్సర్ బుక్ లెట్లను అందుబాటులో ఉంచింది.

టాపిక్

Ts Group 1Hall TicketTgpscTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024