OTT Thriller Movie: తెలుగులోనూ ఓటీటీలోకి వస్తున్న హిందీ థ్రిల్లర్ మూవీ.. డ్యుయల్ రోల్లో ప్రభాస్ హీరోయిన్.. ట్విస్టులతో..

Best Web Hosting Provider In India 2024


OTT Thriller Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ డ్యుయల్ రోల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 14) రిలీజ్ కాగా.. ట్విస్టులతో ఉత్కంఠ రేపేలా సాగింది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్ చేయనుండటం విశేషం. ఈ సినిమా పేరు దో పత్తి.

దో పత్తి ఓటీటీ రిలీజ్ డేట్

దో పత్తి (రెండు ప్లేయింగ్ కార్డ్స్ అని అర్థం) ఓ హిందీ థ్రిల్లర్ మూవీ. ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో సీతగా నటించిన కృతి సనన్.. ఈ దో పత్తి సినిమాలో ట్విన్స్ గా డ్యుయల్ రోల్లో నటిస్తోంది. తాజాగా సోమవారం (అక్టోబర్ 14) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా అక్టోబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో హిందీతోపాటు తెలుగు, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కృతి సనన్ తోపాటు మరో సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఈ సినిమా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది.

దో పత్తి ట్రైలర్ ఎలా ఉందంటే?

దో పత్తి మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కు వస్తోంది. శశాంక చతుర్వేది డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ ను సోమవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్ మొదట్లోనే పోలీస్ ఆఫీసర్ అయిన కాజోల్ ఓ వ్యక్తిని ఓ ప్రమాదం గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు ఆ రోజు ఉదయం ఏం జరిగిందని నిలదీస్తుంది.

ఆ తర్వాత కాజోల్ పాత్ర ఇంట్రడక్షన్ ఉంటుంది. తాను ఎక్కడికెళ్లినా ఇరుక్కుపోవడం అలవాటైపోయిందని తన గురించి తాను చెప్పుకుంటుంది. ఇక ఆ తర్వాతే అసలు ట్రైలర్ మొదలవుతుంది. ఈ దో పత్తి సినిమాలో సౌమ్య సూద్, శైలీ అనే కవలల పాత్రల్లో నటించిన కృతి సనన్ సీన్లోకి ఎంటరవుతుంది.

మొదట సౌమ్య ఓ వ్యక్తి ప్రేమలో పడుతుంది. అయితే ఆమె వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం ఉండే కవల సోదరి శైలీ ఎంటరవడంతో సీన్ మొత్తం మారిపోతుంది. సౌమ్య ప్రేమికుడిని తన వలలో వేసుకోవడానికి శైలి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సౌమ్యపై హత్యాయత్నం జరుగుతుంది.

ఆ తర్వాత ఏం జరిగింది? తన సోదరి ప్రేమికుడిని తన వలలో వేసుకోవడానికి శైలీ ఎందుకు ప్రయత్నిస్తుంది? చివరికి వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024