Filter coffee : తాగితే ఫిల్టర్​ కాఫీనే తాగాలి అంటున్న ప్రపంచం!

Best Web Hosting Provider In India 2024


సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మరోసారి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. టేస్ట్ అట్లాస్​కి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కాఫీల జాబితాలో రెండొవ స్థానాన్ని దక్కించుకుంది. గొప్ప రుచి, ప్రత్యేకమైన బ్రూయింగ్ ప్రక్రియకు ప్రసిద్ధి చెందిన ఈ కాఫీ దక్షిణ భారత గృహాలలో ప్రధానమైనదన్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్​లో క్యూబా ఎస్​ప్రెస్సో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

ఆ సువాసన.. అమోఘం!

దక్షిణ భారత ఫిల్టర్ కాఫీని తయారు చేసే సాంప్రదాయ పద్ధతిలో సరళమైన, స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ యంత్రం ఉంటుంది. ఈ పరికరంలో రెండు భాగాలు ఉంటాయి. పైన కాఫీ పౌడర్​ కలిగి ఉంటుంది. అందులో వేడి నీళ్లు పోస్తే, దిగువ భాగం కాచిన కాఫీని సేకరిస్తుంది. కాఫీ నెమ్మదిగా దిగువకు జారుతుంటే, ఆ సువాసనలు అమోఘం కదూ! చాలా మంది కాఫీ ప్రియులు రాత్రిపూట ఫిల్టర్​ని ఏర్పాటు చేస్తారు. ఉదయం వేడి వేడి ఫిల్టర్​ కాఫీ నోట్లో పడితేనే రోజు మొదలవుతుంది

ఈ కాఫీ మిశ్రమాన్ని పాలు, కావాల్సినంత చక్కెరలో కలుపుకుని తాగుతారు. చిన్నపాటి స్టీల్​ గ్లాసులో దీన్ని సర్వ్​ చేయడం చూస్తూనే ఉంటాము. సాసర్​లో కాఫీ పోసుకుని సిప్​ చేస్తుంటే, ఆ ఫీలే వేరు!

సౌత్​ ఇండియా ఫిల్టర్​ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడం చాలా మంది గర్వంగా ఫీల్​ అవుతున్నారు. గ్రీస్​కి చెందిన ఎస్​ప్రెస్సో ఫ్రెడో, ఇటాలియన్​ కాపచీనో, టర్కిష్​ కాఫీ వంటి ఫేమస్​ డ్రింక్స్​ని వెనక్కి నెట్టి, ఈ ఫిల్టర్​ కాఫీ రెండో స్థానంలో నిలబడటం నిజంగా గొప్ప విషయం.

అయితే రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫైన్​ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది మనిషికి మనిషికి వేరువేరుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. షుగర్​ ఇన్​టేక్​ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేకపోత జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి వంటివి తలెత్తొచ్చని చెబుతున్నారు.

కాగా టేస్ట్ అట్లాస్ ఈ ఫిల్టర్​ కాఫీ 2వ స్థానంలో రావడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చ్​లో రిలీజ్​ చేసిన ర్యాంకింగ్స్​లో కూడా ఫిల్టర్​ కాఫీకి రెండో ర్యాంక్​ దక్కింది. త్వరలోనే సౌత్​ ఇండియాకి చెందిన ఫిల్టర్​ కాఫీకి నెంబర్​.1 ర్యాంక్​ వస్తే, ఇది నిజంగా గర్వకారణం అని అందరు అభిప్రాయపడుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link