Best Web Hosting Provider In India 2024
OTT Crime Thriller: ఓటీటీలోకి అనుకున్నదాని కంటే ఎంతో ముందుగానే వచ్చేస్తోంది ఓ హాలీవుడ్ డిజాస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడిన ఈ సినిమా.. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీ పేరు జోకర్: ఫోలీ ఎ డూ (Joker: Folie à Deux).
జోకర్ ఫోలీ ఎ డూ ఓటీటీ రిలీజ్ డేట్
జోకర్ ఫోలీ ఎ డూ (Joker: Folie à Deux) మూవీ అక్టోబర్ 4న థియేటర్లో రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి తొలి షో నుంచే దారుణమైన రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ వసూళ్లు పడిపోతూ వచ్చాయి. 2019లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లు వసూలు చేసిన జోకర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ జోకర్: ఫోలీ ఎ డూ మాత్రం బోల్తా పడింది.
జోకర్ ఫోలీ ఎ డూ బాక్సాఫీస్ కలెక్షన్లు
జోకర్ మూవీ 2019లో రిలీజై బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన జోకర్ ఫోలీ ఎ డూపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దారుణంగా ఉందంటూ తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.
ఏకంగా 200 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కడంతోపాటు మార్కెటింగ్ కోసం మరో 100 మిలియన్ డాలర్లను ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. అయితే ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 165 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. జోకర్ మూవీతో పోలిస్తే ఇది అసలు దరిదాపుల్లోనూ లేదు. ఈ సినిమాకు మరీ దారుణంగా డీ సినిమా స్కోరు ఇవ్వడం కూడా మేకర్స్ కు మింగుడు పడనిదే.
అటు రోటెన్ టొమాటోస్ లోనూ కేవలం 33 శాతం స్కోరు మాత్రమే సాధించింది. ఈ జోకర్: ఫోలీ ఎ డూ మూవీలో జోక్విన్ ఫీనిక్స్ తోపాటు లేడీ గాగా, బ్రెండన్ గ్లీసన్, కాథెరిన్ కీనర్, జాజీ బీట్జ్, స్టీవ్ కూగన్, హ్యారీ లాటీలాంటి వాళ్లు నటించారు. టాడ్ ఫిలిప్స్ డైరెక్ట్ చేశాడు. 2019లో వచ్చిన జోకర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాగా.. ఈ సీక్వెల్ మాత్రం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.