Prakasam Jobs : ప్రకాశం జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖలో 20 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌- దరఖాస్తులకు అక్టోబర్ 21 ఆఖ‌రు

Best Web Hosting Provider In India 2024

ప్రకాశం జిల్లా ప‌రిధిలో మ‌హిళా, శిశు సంక్షేమ, సాధికార‌త అధికారి కార్యాల‌యంలో ఖాళీగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అక్టోబ‌ర్ 21 ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా అధికారులు కోరుతున్నారు.

ప్రకాశం జిల్లాలోని మహిళ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీసీ), స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ఏఏ), చిల్డ్రన్ హోమ్స్ (ఒంగోలు, గిద్దలూరు)లో ఖాళీగా ఉన్న 20 ఉద్యోగాల‌కు అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆహ్వానించారు. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప‌ద్ధతిలో భ‌ర్తీ చేస్తారు. ప‌నితీరు ఆధారంగా వారి స‌ర్వీసును కొన‌సాగిస్తామ‌ని పేర్కొన్నారు.

ఇందులో అర్హులైన అభ్యర్థుల‌కు మాత్రమే ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇంట‌ర్వ్యూలు నిర్వహించి నియామ‌కం జ‌రుపుతారు. ఈ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష, ఉద్యోగుల‌కు అప్లై చేయ‌డానికి ఎటువంటి ఫీజు ఉండ‌దు. పోస్టుల బ‌ట్టీ ఏడో త‌ర‌గ‌తి, ప‌దో త‌ర‌గ‌తి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ విద్యార్హత‌తో పాటు అనుభ‌వం అవ‌స‌రం ఉంటుంది. డేటా అన‌లిస్టు, డాక్టర్ పోస్టుల‌కు మిన‌హా మిగిలిన పోస్టులన్నీంటికి మ‌హిళ‌లు మాత్రమే అర్హులు.

20 పోస్టుల‌ భ‌ర్తీ

ప్రకాశం జిల్లాలో 20 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో సోష‌ల్ వ‌ర్కర్ -1, డేటా అన‌లిస్టు -1, స్పెషలైజేడ్ అడాప్షన్ ఏజెన్సీలో సోష‌ల్ వ‌ర్కర్ -1, డాక్టర్ (పార్ట్‌టైమ్‌) -1, ఆయా -1, చౌకిదార్ (వాచ్‌మెన్) -1, చిల్డ్రన్ హోమ్స్ (ఒంగోలు)లో హౌస్ కీప‌ర్‌- 1, ఎడ్యుకేట‌ర్- 2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచ‌ర్-1, మ్యూజిక్ టీచ‌ర్‌- 1, పీటీ ఇన్ట్స్ర‌క్ట‌ర్-1, యోగ టీచ‌ర్‌- 1, చిల్డ్రన్ హోమ్స్ (గిద్దలూరు) స్టోర్ కీప‌ర్ అండ్ అకౌంటెంట్‌-1, ఎడ్యుకేట‌ర్- 2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచ‌ర్-1, మ్యూజిక్ టీచ‌ర్‌- 1, పీటీ ఇన్ట్స్రక్టర్-1, యోగ టీచ‌ర్‌- 1

వేత‌నం…వయో పరిమితి

సోష‌ల్ వ‌ర్కర్ -రూ.18,536, డేటా అన‌లిస్టు- రూ.18,536, డాక్టర్ (పార్ట్‌టైం)- రూ.9,930, ఆయా- రూ.7,944, నైట్ వాచ్‌మెన్- రూ.7,944, హౌస్ కీప‌ర్‌- రూ.7,944, స్టోర్ కీప‌ర్ అకౌంటెంట్ – రూ. 18,536, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచ‌ర్- రూ.5,000, మ్యూజిక్ టీచ‌ర్‌- రూ.5,000, పీటీ ఇన్ట్స్రక్టర్- రూ.5,000, యోగ టీచ‌ర్‌- రూ.5,000 నెల‌వారీ వేత‌నం ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్యర్థుల వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుండి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌ల‌కు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు సడలింపు కూడా వర్తిస్తుంది. డాక్టర్ పోస్టుకు ఎటువంటి వ‌యోప‌రిమితి లేదు.

దీనికి సంబంధించిన‌ పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3f3f27a324736617f20abbf2ffd806f6d/uploads/2024/10/2024100971.pdf ను క్లిక్ చేయండి. అలాగే అప్లికేష‌న్ డౌన్‌లోడ్ కోసం ఈ లింక్ https://cdn.s3waas.gov.in/s3f3f27a324736617f20abbf2ffd806f6d/uploads/2024/10/2024100935.pdf ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఖాళీల‌ను పూర్తి చేసి సంబంధిత స‌ర్టిఫికేట్లను జ‌త‌చేసి, అక్టోబ‌ర్ 21 సాయంత్రం 5 గంట‌ల లోపు జిల్లా మ‌హిళా, శిశు సంక్షేమ‌, సాధికార‌త అధికారి కార్యాల‌యం, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో అంద‌జేయాలి.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsJobsAp JobsTelugu NewsPrakasam District
Source / Credits

Best Web Hosting Provider In India 2024