Bank of Maharashtra: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ జాబ్స్; 600 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

Best Web Hosting Provider In India 2024


Bank of Maharashtra jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ bankofmaharashtra.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 600 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, వయో పరిమితి వంటి ప్రమాణాల వివరాలను ఇక్కడ చూడండి.

లాస్ట్ డేట్ అక్టోబర్ 24..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 14న ప్రారంభమై, 2024 అక్టోబర్ 24న ముగుస్తుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.

విద్యార్హతలు

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ సాధించి ఉండాలి. తన స్వ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక భాషలో (రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్) ప్రావీణ్యం కలిగి ఉండాలి. అప్రెంటీస్ 10 లేదా 12వ తరగతి మార్కుల షీట్/ సర్టిఫికేట్ లో ఏదో ఒక భాషను స్థానిక భాషగా పేర్కొని ఉండాలి.

వయోపరిమితి

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్

అప్రెంటీస్ కు ఏడాది పాటు నెలకు రూ.9000 స్టైపెండ్ లభిస్తుంది. వారు మరే ఇతర అలవెన్సులు / ప్రయోజనాలకు అర్హులు కాదు.

ఎంపిక విధానం

అభ్యర్థులు 12వ తరగతి/10+2)/ డిప్లొమా లో సాధించిన మార్కుల శాతం వివరాలతో బ్యాంకు వెబ్ సైట్ లో ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి. 12వ తరగతి (10+2)/డిప్లొమా పరీక్షలో సాధించిన మార్కులు/శాతం ఆధారంగా అప్రెంటిస్ ఎంగేజ్మెంట్ మెరిట్ జాబితాను రాష్ట్రాల వారీగా తయారు చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ చేసిన అప్రెంటిస్ ల నియామకం వారు వైద్యపరంగా ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించడం, పూర్వాపరాలను ధృవీకరించడం, బ్యాంక్ నిర్ణయించిన ఇతర ఫార్మాలిటీలకు లోబడి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు నాట్స్ వెబ్ పోర్టల్ https://nats.education.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

అన్ రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.150+జీఎస్టీ, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు రూ.100+జీఎస్టీ అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link