Best Web Hosting Provider In India 2024
పెసరపప్పుతో చేసే చీలా పోషకభరితం అయిన అల్పాహారం. వీటి తయారీకి చాలా కూరగాయలు వాడతాం. దీంతో పాటూ పెసరపప్పు వల్ల అనేక పోషకాలూ దొరుకుతాయి. కేలరీలు తక్కువుండే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారీ ఎలాగో చూసేయండి. దీన్ని లంచ్ బాక్స్ లోకి పెట్టిచ్చినా పిల్లలు ఇష్టంగా తినేస్తారు.
పెసరపప్పు చీలా తయారీకి కావాల్సినవి:
1 కప్పు పెసరపప్పు
1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ –
1 సన్నగా తరిగిన క్యాప్సికమ్
సన్నగా తరిగిన క్యాబేజీ –
2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి –
అర టీస్పూను జీలకర్ర
రుచికి తగినంత ఉప్పు
టీ స్పూను పసుపు
1 తరిగిన టొమాటో
1 తరిగిన ఉల్లిపాయ
1 టీస్పూన్ కారం
గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర
పెసరపప్పు చీలా తయారీ విధానం:
- పెసర పప్పు చీలా తయారు చేయాలంటే ముందుగా పెసరపప్పును బాగా కడిగి ఒక పాత్రలో నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టాలి.
- పప్పు బాగా నానిన తర్వాత నీళ్లు వంపేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టండి. అయితే మరీ పలుచగా అవ్వకుండా చూసుకోండి.
- ఇప్పుడు ముద్దను ఒక పెద్ద పాత్రలో తీసుకుని అందులో పసుపు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, ఎండుమిర్చి పొడి, సన్నగా తరిగిన కూరగాయలు, కొత్తిమీర వేసి కలపాలి. వీటన్నింటినీ నీళ్లు పోసి బాగా కలపుకోండి.
- ఇప్పుడు పెనం పెట్టుకుని నూనె లేదా నెయ్యి రాసి వేడి చేయాలి. ఆ తర్వాత పెసరపప్పు పిండి గరిటెడు వేసి బాగా స్ప్రెడ్ చేయాలి.
- మీడియం మంట మీద రెండు వైపుల నుండి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు కాల్చుకోవాలి. కాస్త క్రిస్పీగా అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవమే. పెసరపప్పు చీలా రెడీ.
- మీకిష్టం ఉంటే ఈ చీలా మీద పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మరిన్ని వేసుకుని రోల్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.