RGV Lawrence Bishnoi: ఈ గ్యాంగ్‌స్టర్ ముందు ఏ సినిమా హీరో పనికిరాడు.. సల్మాన్ ఖాన్‌కు సవాలు: ఆర్జీవీ ట్వీట్

Best Web Hosting Provider In India 2024

RGV Lawrence Bishnoi: ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. అతని సినిమాలైనా, ట్వీట్లయినా వార్తల్లో నిలవాల్సిందే. తాజాగా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ లను ఉద్దేశించిన అతడు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. కృష్ణజింకను వేటాడిన కేసులో ఇప్పటికీ సల్మాన్ ను చంపాలని చూస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గురించి రాంగోపాల్ వర్మ ప్రతి రోజూ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు.

సల్మాన్‌ను రెచ్చగొట్టిన ఆర్జీవీ

ఆర్జీవీ తాజాగా చేసిన ట్వీట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను రెచ్చగొట్టాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరికలకు తగినట్లుగా స్పందించాలని, అలా అయితేనే తాను పిరికివాడు కాడని నిరూపించుకుంటాడని వర్మ ట్వీట్ చేయడం విశేషం.

“సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ కి సూపర్ కౌంటర్ థ్రెట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. లేదంటే టైగర్ స్టార్ పిరికితనంలా అనిపిస్తుంది. బీతో పోలిస్తే తాను పెద్ద సూపర్ హీరో అని అభిమానులకు నిరూపించాల్సిన అవసరం సల్మాన్ ఖాన్ పై ఉంది” అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

లారెన్స్ బిష్ణోయ్‌లాగా ఎవరూ లేరు

ఇక మరో ట్వీట్ లో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లాగా ఏ ఫిల్మ్ స్టార్ లేడు అని కూడా ఆర్జీవీ అన్నాడు. ఈ సందర్భంగా అతనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా ఆర్జీవీ ట్వీట్ చేశాడు.

“ఓ అతిపెద్ద గ్యాంగ్‌స్టర్ పై ఎవరైనా సినిమా తీయాలని అనుకుంటే.. దావూద్ ఇబ్రహీంలాగానో, చోటా రాజన్ లాగానో ఉండే వ్యక్తిని తీసుకోరు. కానీ ఇతన్ని చూడండి. బీ కంటే బాగా కనిపించే ఏ ఫిల్మ్ స్టార్ ని నేను చూడలేదు” అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇక్కడ బిష్ణోయ్ ని ఆర్జీవీ బీ అని షార్ట్ గా పిలుస్తున్నాడు.

1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడిన సమయంలో లారెన్స్ బిష్ణోయ్ వయసు కేవలం ఐదేళ్లని, అలాంటి వ్యక్తి 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం చూస్తుండటం ఆశ్చర్యంగా ఉందని ఈ మధ్యే ఆర్జీవీ మరో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్వీట్ వైరల్ అయిన విషయాన్ని కూడా అతడు చెప్పాడు.

తనకు ఎక్స్ లో 6.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారని, తాను బిష్ణోయ్ పై చేసిన ట్వీట్ ను 6.2 మిలియన్ల మంది చూశారంటే ప్రస్తుతం అతనికి ఉన్న పాపులారిటీ ఎంతో అర్థమవుతోందని కూడా ఆర్జీవీ అన్నాడు.

1998లో హమ్ సాథ్ సాథ్ హై మూవీ షూటింగ్ సమయంలో రాజస్థాన్ లో సల్మాన్ ఖాన్ ఓ కృష్ణ జింకను వేటాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించే చాలా రోజులుగా సల్మాన్ తోపాటు అతని సహచరులకు కూడా లారెన్స్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ మధ్యే ఎన్సీపీ నేత, సల్మాన్ సహచరుడు బాబా సిద్ధిఖీ హత్యలోనూ లారెన్స్ హస్తం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024