ఏపీలో అరాచక పాలన నడుస్తోంది

Best Web Hosting Provider In India 2024

 వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి

 శాంతిభద్రతల విషయంలో కూటమి సర్కార్‌ వైఫల్యం

 ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోంది

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ తీరును  ఆయన  ఎండగట్టారు. బుధవారం శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నాలుగు నెలలు గడుస్తోంది. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయి.  బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు నిందితులను ఎలా శిక్షించాలనే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా అలాంటి చర్యలు కనిపించడం లేదు. ప్రజలకు ఏది మంచి, ఏది చెడు అన్నది ఆలోచన చేసి పరిపాలన సాగించాలి.
గతంలో ఎన్టీఆర్‌ మద్యాన్ని నిషిధిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాణ్యమైన మద్యం ఇస్తామని హామీ ఇచ్చి, తీరా ఇప్పుడు నాసిరకం మద్యాన్ని ప్రజలకు అంటగట్టి దోచుకోవాలని చూస్తున్నారు. మద్యాన్ని దశల వారీగా నిషేదించాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చర్యలు తీసుకుంటే..ఇవాళ చంద్రబాబు మద్యం షాపులకు టెండర్లు నిర్వహించి తన వారికి కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపుల సంస్కృతిని తీసుకువస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుంది, అన్ని రకాలుగా నష్టపోతారు. ఆర్థిక మూలాలు నాశమవుతాయి. కుటుంబాలు నాశనమై రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా కాకుండా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. చంద్రబాబుకు రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు కమీషన్లు ఇవ్వాల్సిందే అన్నట్లుగా బెదిరింపులకు దిగుతున్నారు.ఇలాంటి దారుణమైన సంఘటనలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవు. చంద్రబాబు ఈ విషయంపై జోక్యం చేసుకొని ఆ పార్టీ వారిని కంట్రోల్‌లో పెట్టుకోవాలని సూచించారు.
చంద్రబాబు అవినీతిపై ఈడీ ఆస్తులు అటాచ్‌ చేస్తే..తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని, ఆయన దోషి అని పక్కా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.
 

Best Web Hosting Provider In India 2024