Nani Odela 2: అఫీషియల్: నాని మూవీకి అనిరుధ్ రవిచందర్.. నేచురల్ స్టార్‌తో మూడోసారి..

Best Web Hosting Provider In India 2024

తమిళ సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారు. కోలీవుడ్‍లో వరుస హిట్లతో టాప్ రేంజ్‍కు దూసుకెళ్లారు. తెలుగులోనూ అనిరుధ్‍కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దేవర సినిమా మరోసారి తన మార్క్ నిరూపించుకున్నారు అనిరుధ్. అవకాశాలు వెల్లువలా వస్తున్నా.. సెలెక్టివ్‍గా ఓకే చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మూవీకి (Nani Odela 2) మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

పుట్టిన రోజున..

నాని, శ్రీకాంత్ ఓదెల సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ మూవీ టీమ్ నేడు (అక్టోబర్ 16) అధికారికంగా వెల్లడించింది. నేడు అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అనిరుధ్‍కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ‘నాని ఓదెల 2’ టీమ్. హ్యాపీ బర్త్‌డే రాక్ స్టార్ అంటూ పోస్టర్ తీసుకొచ్చింది.

నాని ఓదెల 2 చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. అయితే, ఇంతకాలం మూవీ టీమ్ మౌనంగానే ఉంది. నేడు ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చేసింది.

నానితో అనిరుధ్ మూడోసారి

గతంలో నాని హీరోగా నటించిన జెర్సీ, గ్యాంగ్‍లీడర్ సినిమాలకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జెర్సీ మూవీలో తన మ్యూజిక్‍తో ఆకట్టుకున్నారు. గ్యాంగ్‍లీడర్‌లోనూ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఇప్పుడు మూడోసారి నాని మూవీ కోసం అనిరుధ్ పని చేయనున్నారు. అయితే, శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని ఇంటెన్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నారు. అనిరుధ్ ఈ రకం సినిమాలు బాగా సూటవుతాయి. మరి, నానికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి.

గతేడాది దసరా మూవీతో నాని బ్లాక్‍బస్టర్ కొట్టారు. ఈ మూవీతోనే దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల పరిచయం అయ్యారు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. మాస్ యాక్షన్ పాత్రలోనూ నాని అదరగొట్టారు. తన రెండో చిత్రాన్ని కూడా నానితోనే చేస్తున్నారు శ్రీకాంత్. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.

నాని ఓదెల 2 మూవీ యాక్షన్ డ్రామా మూవీగా ఉండనుంది. ఇప్పటికే వచ్చిన లుక్‍తో ఈ విషయం అర్థమైపోయింది. రక్తపాతానికి సిద్ధంగా ఉండాలంటూ అనౌన్స్‌మెంట్ సమయంలోనే మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.

నాని ఓదెల 2 చిత్రాన్ని ఎస్‍ఎల్‍వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూజ్ చేయనున్నారు. దసరా మూవీని కూడా ఈ ప్రొడక్షన్ హౌసే నిర్మించింది. ఈ చిత్రంతోనే అదే కాంబో రిపీట్ అవుతోంది.

నేచురల్ స్టార్ నాని రీసెంట్‍గా సరిపోదా శనివారం చిత్రంతో బ్లాక్‍బస్టర్ కొట్టారు. అక్టోబర్ 29న రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో సూపర్ హిట్ సాధించింది. దసరా, హాయ్ నాన్న తర్వాత సరిపోదాతో హ్యాట్రిక్ కొట్టారు నేచురల్ స్టార్.

దేవరకొండ మూవీకి కూడా..

విజయ్ దేవరకొండ నటిస్తున్న వీడీ12 మూవీకి కూడా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ మూవీని నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ కూడా అనిరుధ్‍కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ తీసుకొచ్చింది. వీడీ12లోని ఎక్స్‌ప్లోజివ్ సౌండ్ తుఫాన్ తీసుకొస్తుందంటూ ట్వీట్ చేసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024