Saree: ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు ఇలా చీర కడితే పొడవుగా కనిపిస్తారు, ప్రయత్నించండి

Best Web Hosting Provider In India 2024

ఆధునిక కాలంలో పాశ్చాత్య దుస్తులకే ప్రాధాన్యం పెరిగిపోయింది. అయినా మధ్యమధ్యలో పండుగ సమయంలో చీర కట్టుకోవడం వంటివి చేస్తారు.  ఆఫీసులో వేడుక అయినా, ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చీర కట్టుకున్నా  చాలా కాంప్లిమెంట్స్ మహిళలకు వస్తుంటాయి. కానీ ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు మాత్రం చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.  పొట్టిగా ఉన్నవారికి చీర బాగోదని, తాము అందంగా ఇంకా పొట్టిగా కనిపిస్తామని అనుకుంటారు.  అటువంటి వారు కొన్ని చిట్కాలు మీకు చెప్పాము. చీర కట్టుకున్న తర్వాత ఎత్తుగా కనిపించాలంటే  చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చీర కడితే పొట్టి వారు కూడా కాస్త సన్నగా, పొడవుగా కనిపిస్తారు. 

చీరకట్టు చిట్కాలు

1) చీర కట్టుకున్న తర్వాత ఎత్తుగా కనిపించాలంటే సరైన చీరను ఎంపిక చేసుకోవాలి. తక్కువ ఎత్తు ఉన్న మహిళలు పెద్ద అంచులు ఉన్న చీరలను ఎంపిక చేసుకోకూడదు. ఎల్లప్పుడూ పొట్టి బోర్డర్ ఉన్న చీరను ధరించండి.

2) చీర కట్టుకున్న తర్వాత పొడవుగా కనిపించాలనుకుంటే బ్లౌజ్ డిజైన్ ను సరిగ్గా ఎంచుకోండి. మీరు ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు బోట్ నెక్ వంటి మెడ కప్పేసే బ్లౌజ్ డిజైన్లు ధరించడం మానుకోండి. మీ సౌకర్యానికి అనుగుణంగా వి ఆకారంలో ఉండే మెడ డిజైన్ లేదా లోతైన మెడ బ్లౌజ్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

3) మీరు తక్కువ పొడవు ఉన్నప్పుడు, చీరతో సరిగా నడవలేమని అనుకుంటారు. చీర కట్టుకునేటప్పుడు కాస్త ఎత్తుగా ఉండే హీల్స్ ను వేసుకోవాలి.  చీర కట్టుకోవడం ద్వారా మరింత పొడవుగా కనిపించాలనుకుంటే, ఎల్లప్పుడూ పొడవాటి పల్లూ ఉండేలా చీర కట్టుకోండి. 

4) ఎల్లప్పుడూ పలుచటి, సున్నితమైన వస్త్రం కలిగిన చీరను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. కాటన్, సిల్క్ వంటి హార్డ్ ఫ్యాబ్రిక్ ధరించడం వల్ల శరీరం లావుగా కనిపించడంతో పాటు ఎత్తు కూడా తక్కువగా కనిపిస్తారు. మీరు షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్ తో  తయారుచేసిన చీరను ధరించడం ఉత్తమం. వీటితో పాటు చీర ప్రింట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద ప్రింట్ లు కాకుండా, చిన్న చిన్న ప్రింట్ డిజైన్ ఉన్న చీరలను ఎంపిక చేసుకోవాలి. 

5) చీర కట్టుకున్నాక మీరు పొడవుగా కనిపించాలనుకుంటే ముదురు రంగు చీరను ఎంచుకోండి. లేత రంగులు ధరించడం వల్ల ఎత్తు తక్కువగా కనిపిస్తుంది.

పొట్టిగా ఉన్నవారికి ఆత్మవిశ్వాసం తగ్గాల్సిన అవసరం లేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. పొట్టిగా ఉన్నా లేక పొడవుగా ఉన్నా కూడా చీర కట్టులో చక్కగానే కనిపిస్తారు. 

 

 

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024