NNS October 17th Episode: ఆరు ఆత్మను బంధించిన ఘోరా- తల్లి గిఫ్ట్ చూసి షాకైన అంజు- మనోహరికి రణ్‌వీర్ లాస్ట్ వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 17th October Episode)లో మనోహరి ఉదయం నుంచి తేడాగా ఉందని కొత్తగా రూమ్ లాక్‌ చేస్తుందని, అది ఏంటో తెలుసుకోవాలని రాథోడ్​కి చెబుతుంది భాగీ. అయితే ఇప్పుడే తెలుసుకుంటానని రాథోడ్‌ రూమ్ దగ్గరకు వెళ్లి తెరవడానికి ప్రయత్నిస్తాడు.

ఫొటోపై పౌడర్

లోపల లాక్‌ చేసినట్టు ఉందని ఆగిపోతాడు రాథోడ్. లోపల ఘోరాతో ఉన్న మనోహరి.. అరుంధతిని ఎలా పొడి ముట్టుకునేలా చేయాలని ఆలోచిస్తుంది. వెంటనే లేచి వెళ్లి అల్మారాలో ఉన్న అమర్‌ ఫోటో తీసుకొచ్చి ఘోరాకు ఇస్తుంది. ఇదిగో ఈ అమర్‌ ఫోటోను ఎలాగైనా అరుంధతి చూస్తుండగా కింద పడేయాలి. అప్పుడు అది ఫోటోను పైన పెట్టడానికి తీసుకుంటుంది. ఆ పౌడర్‌‌ను ఈ ఫోటో మీద చల్లాలి అనుకుంటుంది మనోహరి.

ఆ ఆత్మ పట్టుకునే లోపు ఎవరైనా తీసేస్తే.. అంటాడు ఘోరా. తీయకుండా నేను చూస్తాను అనగానే అమర్‌ ఫోటో మీద పొడి చల్లి మంత్రిస్తాడు ఘోరా. ఫోటో తీసుకుని మనోహరి బయటకు వెళ్లుంది. డోర్‌ దగ్గర ఉన్న రాథోడ్‌‌ను చూసి షాక్ అవుతుంది మనోహరి. దుమ్ము చాలా ఉంది. రోజు తుడవడం లేదనుకుంటా? అంటాడు రాథోడ్. ఓవర్‌‌గా ఉంది అంటుంది మనోహరి. ఏంటి మేడం ఇప్పుడు మీరు నాతో ఏదైనా అన్నారా? అని అంటాడు.

చాలా ఓవర్ అయింది

చాలా ఓవర్‌ అయింది అన్నాను అని మనోహరి అనగానే ఏదో చెప్తూనే రాథోడ్‌ డోర్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటే రాథోడ్‌ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. లోపలి నుంచి మాటలు వినిపించాయి. లోపల ఎవరైనా ఉన్నారా? మేడం అని అడగ్గానే లేరని చెప్తుంది. గుప్తా తల కిటికీలో ఇరుక్కుపోతుంది. అరుంధతిని పిలిచి నువ్వు త్వరగా వచ్చేయ్‌ అని చెప్తాడు. సరే అని వెళ్లిపోతుంది అరుంధతి.

మనోహరికి రణవీర్‌ ఎదురుపడతాడు. ఏంటి మనోహరి ఏదో కంగారులో ఉన్నట్టున్నావు. ఏదో పనిలో ఉన్నావని నాకు అనిపిస్తుంది. అది నేను చెప్పిన పనే అనుకుంటున్నాను అంటాడు. ప్లీజ్‌ రణవీర్‌ ఇక్కడ మనం ఇలా ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లమ్‌ అవుతుంది అని బతిమిలాడుతుంది మనోహరి.

ప్రాబ్లమ్‌ చేయడానికే కదా నేను వచ్చింది. ఇవాళ సాయంత్రం లోపు దుర్గ నా కళ్లముందుకు రాకపోతే ఈ ఇంట్లో నీ నిజ స్వరూపం మొత్తం బయటపెట్టేస్తాను. నువ్వు నీ స్నేహితురాలిని చంపి మొదలు పెట్టిన ఆట. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చిన అన్ని నిజాలను ఆ అమర్‌ ముందు బయటపెడతాను. నువ్వు కోరుకున్న జీవితం నీకు కావాలంటే నా కూతురును నాకివ్వు.. అటాడు రణ్​వీర్​.

ఆఖరి ఛాన్స్

నాకు కొంచెం టైం కావాలి రణ్​వీర్‌ అనగానే టైం కావాలా? నీకు అయితే సరే నేను అమర్‌‌కు నిజం చెప్తాను అంటాడు. నిజం చెప్తావా? రణవీర్‌ వెళ్లి చెప్పు. ఈసారి నేను ఆపను. నిజం చెప్తే నీ కూతురు నీ దగ్గరకు వస్తుందా? ఇప్పుడేంటి.. అమర్‌ నీ కూతురు ఎక్కడుందో కనిపెడతాడనుకున్నావా? నువ్వు జీవితం అంతా వెతికినా దుర్గ నీకు దొరకదు అని బెదిరిస్తుంది మనోహరి.

సరే మనోహరి ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. ఈసారి దుర్గను నాకు అప్పగించకుంటే నా ఆస్తి మొత్తం పోతుంది. ఆస్థి పోయాక నేను దేన్ని లెక్క చేయనని నీకు బాగా తెలుసు అంటాడు రణ్​వీర్​. ఈసారి మిస్‌ అవ్వదు రణవీర్‌ అని చెప్పగానే రణవీర్‌ వెళ్లిపోతాడు. అంజు కేక్‌ కటింగ్‌ జరుగుతుంది. అక్కడ అందరూ ఉంటారు. అరుంధతి వెనక నిలబడి ఉంటే ముందుకు రమ్మని భాగీ పిలుస్తుంది. వద్దులే అని అక్కడే ఉంటుంది ఆరు.

ఆత్మను బంధించిన ఘోరా

ఇంతలో అమర్‌ ఫోటోను మనోహరి ఒక మూలగా పెట్టడాన్ని గమనిస్తుంది అరుంధతి. ఇంతలో భాగీ వస్తుంది. తను తీసుకొచ్చిన గిఫ్ట్‌ అంజుకు ఇవ్వమని భాగికి ఇచ్చి వెళ్లి అమర్‌ ఫోటో చేతిలోకి తీసుకుంటుంది అరుంధతి. వెంటనే ఘోరా దగ్గరకు బంధీగా వెళ్తుంది అరుంధతి ఆత్మ. ఘోర ఆత్మను చూసి గట్టిగా నవ్వుతుంటాడు. గుప్త కంగారుగా అరుంధతి ఎక్కడ ఉందని వెతుకుతుంటాడు.

ఇంతలో అక్షింతలు తీసుకుని వచ్చిన భాగీ.. అరుంధతి ఇచ్చిన గిప్ట్‌ చూపించగానే అందరూ షాక్ అవుతారు. అంజు.. అరుంధతిని గుర్తు చేసుకుంటుంది. తను అక్కా అని పిలుస్తుంది ఆత్మని అని భాగీకి తెలిసిపోతుందా? ఘోరా చేతిలో చిక్కిన ఆత్మని ఎవరు కాపాడతారు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 17న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024