Shriya Saran Tarun: బుల్లితెరపై శ్రియా శరణ్, తరుణ్ జోడీ.. 21 ఏళ్ల తర్వాత రిపీట్.. యాంకర్స్‌గా సుడిగాలి సుధీర్, వర్షిణి

Best Web Hosting Provider In India 2024

Shriya Saran Tarun: తెలుగు ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించే ఛానల్​ జీ తెలుగు. నటీనటులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే 2024 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్​ను ఘనంగా నిర్వహించింది.

మెగా ఈవెంట్‌కు

టాలీవుడ్​ ప్రముఖులు, జీ తెలుగు తారల సందడితో కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమం మొదటి భాగం ఇప్పటికే ప్రసారం కాగా, రెండో భాగాన్ని ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్​ జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్​-2ను ఈ ఆదివారం మీముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది.

మరోసారి అలరించేందుకు

అలరించే ప్రదర్శనలు, హృదయాన్ని హత్తుకునే క్షణాలు, మరపురాని అనుభవాలతో తెలుగు టెలివిజన్ స్ఫూర్తిని ప్రతిబింబించే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్-2 అక్టోబర్​ 19 సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్ 2 మరోసారి వారిని అలరించేందుకు రెడీ అయింది.

స్పెషల్ అట్రాక్షన్

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్ 2కు ఎనర్జిటిక్​ యాంకర్స్​ సుధీర్, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఆషిక, సౌందర్యల అద్భుతమైన ప్రదర్శన స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. అలాగే, అన్ని సీరియల్ కుటుంబాల ప్రత్యేక ఎంట్రీతో ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

హీరోలందరితో

మేఘసందేశం సీరియల్​ నటి భూమి నృత్య ప్రదర్శన ఈవెంట్​కి మరింత సంప్రదాయ కళను తీసుకొచ్చింది. యాంకర్ వర్షిణి జీ హీరోలందరితో కలిసి అద్భుతమైన మాస్ డాన్స్​తో వీక్షకుల్లో ఉత్సాహం నింపింది. టాలీవుడ్​​ లవ్లీ పెయిర్​ తరుణ్, శ్రియా శరణ్ ఎంట్రీ ఈ షోకే మరింత ఆహ్లాదాన్ని తీసుకొచ్చింది.

శ్రియా డ్యాన్స్ పర్ఫామెన్స్

శ్రియా సినిమాల్లోని ప్రసిద్ధిగాంచిన సన్నివేశాలను డ్రామా జూనియర్స్ పిల్లలు రీ క్రియేట్​ చేసి నవ్వులు పూయించారు. హీరో తరుణ్​తో జీ తెలుగు తారల అల్లరి, హీరోయిన్ శ్రియా డాన్స్​ ఫెర్ఫామెన్స్​ షోకి హైలెట్​గా నిలిచాయి. స్నేహం ప్రత్యేకతను తెలిపేలా సాగిన సరిగమప సీజన్ 16 కంటెస్టెంట్ల అద్వితీయ ప్రదర్శన ఈ వేదికపై జరిగిన అత్యంత మధురమైన క్షణాలలో ఒకటిగా ఉండనుంది.

గెస్ ది డ్రింక్

అన్ని సీరియల్స్‌లోని జంటలు పాల్గొనే వినోదాత్మక “గెస్ ది డ్రింక్” గేమ్ సరదాగా సాగింది. మేఘసందేశం నటీనటులు శ్రీకృష్ణుని స్మరిస్తూ అందించిన ప్రత్యేక ప్రదర్శన అందరినీ అలరించింది. ఉత్తేజకరమైన, వినోదభరితమైన, భావోద్వేగభరితమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

21 ఏళ్ల తర్వాత

ఇదిలా ఉంటే, శ్రియా శరణ్, తరుణ్ జోడీగా నువ్వే నువ్వే మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ 2002 అక్టోబర్ 10న విడుదలైంది. ఈ మూవీ తర్వాత 2003లో నీ మనసు నాకు తెలుసు చిత్రంలో తరుణ్, శ్రియా ఫ్రెండ్స్‌గా యాక్ట్ చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత అంటే దాదాపుగా 21 ఏళ్ల తర్వాత తరుణ్, శ్రియా ఇలా బుల్లితెరపై సందడి చేయనున్నారు.

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 2లో శ్రియా శరణ్, తరుణ్
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 2లో శ్రియా శరణ్, తరుణ్
Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024