Keerthy Suresh: రివాల్వర్‌తో దడ పుట్టిస్తున్న కీర్తి సురేశ్.. మాస్ అవతార్‌లో రివాల్వర్ రీటా టీజర్ చూశారా?

Best Web Hosting Provider In India 2024

Keerthy Suresh: మహానటితో నేషనల్ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేశ్. ఈ మధ్యే రఘు తాతా అంటూ ఓ కామెడీ మూవీతో వచ్చిన ఆమె.. ఇప్పుడు రివాల్వర రీటా అంటూ ఓ మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గురువారం (అక్టోబర్ 17) ఆమె బర్త్ డే సందర్భంగా మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. రివాల్వర్ తో ఆమె ఆటాడుకుంటూ గూండాలకు వణుకు పుట్టిస్తోంది.

కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా

కీర్తి సురేశ్ ఇప్పుడు రివాల్వర్ రీటా అంటూ ఓ వెరైటీ టైటిల్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో సినిమాలో తన పాత్రలను భిన్నంగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె.. తాజాగా ఈ రివాల్వర్ రీటాలో ఓ మాస్ పాత్ర చేసింది. దీనికి సంబంధించిన టీజర్ ను గురువారం (అక్టోబర్ 17) రిలీజ్ చేశారు.

ఈ టీజర్ మొదట్లోనే ఓ మార్కెట్లో కీర్తీ ఓ బ్యాగు వేసుకొని నిల్చోవడం చూపించారు. కారులో ఉన్న ఇద్దరు గూండాలు ఆమె బ్యాగ్ కొట్టేసి పారిపోతారు. తర్వాత ఆ బ్యాగు తెరిచి చూస్తే అందులో ఓ రివాల్వర్, ఓ రక్తం అంటిన కత్తి, ఓ హ్యాండ్ గ్రెనేడ్ ఉండటం చూసి ఆ గూండాలు షాక్ తింటారు.

తర్వాత కీర్తి సురేశ్ మాస్ ఎంట్రీతో వాళ్ల ముందుకు వస్తుంది. నువ్వు పోలీసా, రా ఏజెంటా లేక డానా అని వాళ్లు ఆమెను అడుగుతారు. తాను రివాల్వర్ రీటా అంటూ మూవీ టైటిల్ ను కీర్తి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ మూవీలో కీర్తి తల్లి పాత్ర చేసిన రాధికా శరత్ కుమార్ ను కూడా టీజర్ చివర్లో చూపించారు.

రివాల్వర్ రీటా మూవీని జేకే చంద్రు డైరెక్ట్ చేశాడు. ఇదొక డార్క్ కామెడీ మూవీ. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తో కీర్తి అదరగొట్టినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్‌లేలాంటి వాళ్లు కూడా నటించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.

కీర్తి సురేశ్ గురించి..

కీర్తి సురేశ్ ప్రస్తుతం తమిళంలో ఈ రివాల్వర్ రీటాతోపాటు కన్నివెడీ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‍లో బేబీ జాన్ మూవీలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. ఇక తెలుగులో సుహాస్‍తో ఉప్పకప్పురంబు మూవీ కూడా కీర్తి లైనప్‍లో ఉంది.

ఇక ఓటీటీలో కీర్తి సురేష్ ర‌ఘు తాత మూవీ కూడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కామెడీ డ్రామా క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ ఇటీవ‌లే జీ5 ఓటీటీలో రిలీజైంది. 24 గంట‌ల్లోనే ర‌ఘు తాత మూవీ యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మిన‌ట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. రీసెంట్ టైమ్‌లో ఓటీటీలో ఒక్క‌రోజులో హ‌య్యెస్ట్ వ్యూస్ ద‌క్కించుకున్న మూవీగా ర‌ఘు తాత నిలిచింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024