Veekshanam Review: వీక్షణం మూవీ రివ్యూ.. పక్కోడి లైఫ్‌లోకి తొంగిచూస్తే.. తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

Best Web Hosting Provider In India 2024

టైటిల్: వీక్షణం

నటీనటులు: రామ్ కార్తీక్, కశ్వి, చిత్రం శ్రీను, నక్షత్ర నైనా, దయానంద్ రెడ్డి, సమ్మేట గాంధీ, నాగ మహేష్, షైనింగ్ ఫణి, తదితరులు

దర్శకత్వం: మనోజ్ పల్లేటి

సంగీతం: సమర్ద్ గొల్లపూడి

సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్

ఎడిటింగ్: జెస్విన్ ప్రభు

నిర్మాతలు: పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి

విడుదల తేది: అక్టోబర్ 18, 2024

Veekshanam Review In Telugu: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్స్‌గా యాక్ట్ చేసిన తెలుగు కామెడీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం వీక్షణం. మనోజ్ పల్లేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఇవాళ (అక్టోబర్ 18) థియేటర్లలో విడుదల కానున్న వీక్షణం సినిమా ప్రీమియర్ షోలు రిలీజ్ డేట్‌కు ఒకరోజు ముందే వేశారు. ఈ నేపథ్యంలో వీక్షణం రివ్యూపై లుక్కేద్దాం.

కథ :

హైదరాబాద్‌లోన ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే అర్విన్ (రామ్ కార్తీక్) చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. అందుకోసం బైనాకులర్స్‌తో ఇరుపొరుగు వారిని గమనిస్తుంటాడు. ఈ క్రమంలోనే నేహా (కశ్వి) అనే అమ్మాయని చూసి ప్రేమలో పడిపోతాడు అర్విన్. అనేక ప్రయత్నాలు చేసి మొత్తానికి నేహాను కూడా ప్రేమలోకి దింపుతాడు అర్విన్.

ఇదిలా ఉంటే, మరోవైపు ఒక అమ్మాయి ప్రతిరోజు ఒక వ్యక్తిని తీసుకురావడం గమనిస్తాడు అర్విన్. ముందు సీరియస్‌గా తీసుకోకపోయినా తర్వాత తను ఏదో పెద్ద క్రైమ్ చేస్తుందని అనుమానిస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి హత్యలు చేస్తుందని తెలుసుకుంటాడు. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ అమ్మాయి చనిపోయి 8 నెలలు అయిందని తెలుస్తుంది.

ట్విస్టులు

చనిపోయిన అమ్మాయి హత్యలు ఎలా చేస్తుంది? ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? తను రోజు చూసిన అమ్మాయి ఎవరు? చనిపోయిన అమ్మాయి అర్విన్‌కు ఎలా కనిపించింది? ఆ అమ్మాయిది హత్యా? ఆత్మహత్యా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే వీక్షణం మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఎవరి పని వారు చేసుకుంటే ఏ గొడవ ఉండదనే కామెంట్స్ ఈ మధ్య బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ మాటలకు పర్ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌గా వీక్షణం సినిమా కథ ఉంటుంది. ఈ పాయింట్‌పైనే డైరెక్టర్ కథ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే విషయం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ప్రతి సీన్‌ను తెరకెక్కించారు డైరెక్టర్.

పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసిన హీరో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందులు ఏమిటి? ఆ సమస్యలు ఎలా అధిగమించాడు? అనే విషయాన్ని తర్వాత ఏం జరుగుతుందో గెస్ చేయని విధంగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ సినిమాను ఆవిష్కరించారు.

ఇంటర్వెల్ ట్విస్ట్

ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఆ తర్వాత వారిద్దరికీ మధ్య గొడవలు ఏర్పడటం, హీరో మరో అమ్మాయిని చూడటం ఆ అమ్మాయి చనిపోయింది అనే విషయం తెలియడం వంటి విషయాలతో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అలా ఇంటర్వెల్‌లో మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెంచారు.

ఇక ఇంటర్వెల్ తర్వాత చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? అని హీరో అతని స్నేహితుల బృందం కనుగొనే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే రొటీన్‌కి భిన్నంగా సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చేలా ఉండడం విశేషం. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయిన ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌గా చిత్రీకరించారు.

చివరి వరకు సినిమాలో లీనమయ్యేలా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో పాత్రలో రామ్ కార్తీక్ ఒదిగిపోయాడు. పక్క వాళ్ల విషయాల మీద ఆసక్తి కనబరిచే ఒక సగటు కుర్రాడిగా సరిగ్గా ఇమిడిపోయాడు. హీరోయిన్ కశ్వి ఓ పక్క గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తూ మరోవైపు తనదైన స్టైల్‌లో అభినయంతో అలరించింది.

మంచి రోల్

బాలనటిగా తనకున్న అనుభవం ఈ సినిమాలో కనిపిస్తుంది. మరో కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కికి మంచి రోల్ అని చెప్పొచ్చు. చనిపోయిన అమ్మాయి పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. షైనింగ్ ఫణి కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగతా పాత్రలు పరిధిమేర ఆకట్టుకున్నారు.

ఇక సినిమాను ఎంగేజ్ చేయడంలో సంగీత దర్శకుడు సమర్థ తన ప్రతిభను చాటారు. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. ఆ బీజీఎమ్‌ను పర్పెక్ట్‌గా అందించి సీన్స్‌ను మరింత ఎలివేట్ అయ్యేలా చేశారు. సాంగ్స్ కూడా పర్వాలేదు. సిద్ శ్రీరామ్ పాడిన ఎన్నెన్నెన్నో సాంగ్, వీక్షణ సాంగ్ చాలా క్యాచీగా ఉన్నాయి. రెండో సినిమాకే సాయి సమర్థ్ మ్యూజిక్‌లో చాలా మెచ్యూరిటీ కనిపించింది.

ఫైనల్‌గా చెప్పాలంటే?

సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ మొత్తాన్ని క్యారీ చేయడంలో బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూపిస్తున్న సమయంలో కెమెరామెన్ పనితనం కనబడింది. సినిమాలోని ఫైట్స్ కూడా భిన్నంగా కనిపించాయి. ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. ఇతర సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఆద్యంతం ఎంగేజ్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్ వీక్షణంను ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024