TGPSC Group1: సుప్రీం కోర్టుకు తెలంగాణ చేరిన గ్రూప్‌ 1 వివాదం, పరీక్షలు వాయిదా వేయాలని అత్యవసర పిటిషన్

Best Web Hosting Provider In India 2024

TGPSC Group1: తెలంగాణ గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై న్యాయవిదాలు కొనసాగుతున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. మరోవైపు సోమవారం నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ న్యాయవాది మోహిత్ రావు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణను సోమవారం చేపడతామని ప్రకటించింది.

మరోవైపు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ పాస్‌ఓవర్ కావడంతో వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి తెలంగాణలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13ఏళ్లుగా తెలంగాణలో గ్రూప్‌ 1నియామకాలు జరగలేదు. 2023లో ప్రిలిమినరీ పరీక్షలు జరిగినా పేపర్‌ లీక్ కావడంతో అవి రద్దు అయ్యాయి. ఆ తర్వాత పరీక్షల్ని రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నారు.

గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల్ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా కొంత మంది అభ్యర్థులు అశోక్‌నగర్‌లో ఆందోళన నిర్వహించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Whats_app_banner

టాపిక్

TspscTs Group 1ExamsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024