Inner Wear: అమ్మాయిల దగ్గర తప్పక ఉండాల్సిన లోదుస్తుల రకాలివే, వీటితో పాశ్చాత్య దుస్తుల్లోనూ సౌకర్యం

Best Web Hosting Provider In India 2024

దాదాపు ప్రతి అమ్మాయికి వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలనే క్రేజ్ ఉంటుంది. కానీ చాలా మంది అమ్మాయిలు పాశ్చాత్య దుస్తులు ధరించడానికి కాస్త ఇబ్బంది పడతారు. వాటిలో ముఖ్య కారణం సరైన లోదుస్తులు వేసుకోకపోవడమే. సాంప్రదాయ దుస్తులకు వాడే లోదుస్తులు వాటితో వేసుకుంటే అస్సలు బాగుండదు. వాటికోసం కొన్ని రకాల లోదుస్తులు ప్రత్యేకంగా కొనాల్సిందే. అవేంటో చూసి కొని పెట్టేసుకోండి.

కామిసోల్స్

వెస్టర్న్ టాప్స్, కుర్తాలు చాలా మట్టకు పారదర్శకంగానే ఉంటాయి. లేదంటే లేసులు, నెట్ డిజైన్లతో వస్తాయి. వాటిని వేసుకున్నప్పుడు కేవలం బ్రా వేసుకుంటే అస్సలు సౌకర్యం ఉండదు. అందుకే కామిసోల్స్ సరైన ఎంపిక. అయితే వీటిలో న్యూడ్ రంగు క్యామిసోల్స్.. అంటే దాదాపు చర్మం రంగు దగ్గరగా ఉంటాయివి. వీటిని వేసుకుంటే లోపల లోదుస్తులు కూడా కనిపించవు. బ్రా ఆకారం అస్సలు కనిపించదు. ఎలాంటి దుస్తులు వేసుకున్నా ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతారు. వీటితో పాటే ముదురు రంగు దుస్తుల కోసం నలుపు రంగు క్యామిసోల్, లేత వాటి కోసం తెలుపు రంగు క్యామిసోల్ తప్పక మీ దగ్గర ఉంచుకోండి.

ట్యూబ్ క్రాప్ టాప్

ట్యూబ్ క్రాప్ టాప్ తప్పకుండా మీ వార్డ్‌రోబ్ లో ఉండాల్సిందే. కొన్ని రకాల దుస్తులకు కామిసోల్ వేసుకోలేరు. కొన్ని టాప్స్, షర్టులకు హాఫ్ షోల్డర్ లేదా కాలర్ లెస్, స్లీవ్స్ సన్నగా ఉండే రకాలు ఉంటాయి. అలాంటివాటికి క్యామిసోల్ నప్పదు. అలాంటప్పుడు బ్రా కనిపించకుండా, మంచి కవరేజీ కూడా ఇచ్చేలా ఈ ట్యూబ్ క్రాప్ టాప్స్ వాడొచ్చు. దాంతో డ్రెస్సులు పారదర్శకంగా ఉన్నా, స్లీవ్స్ లేకున్నా, నెక్ డీప్ ఉన్నా కూడా ఏ ఇబ్బందీ ఉండదు.

లాంగ్ కామిసోల్

మీరు వన్-పీస్ దుస్తులు వేసుకోవాలనుకుంటే ఈ లాంగ్ లేదా పొడవుగా ఉండే క్యామిసోల్స్ పనికొస్తాయి. వీటిని చాలా తేలిగ్గా ఉండే ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తారు. అలాగే బాడీ హగ్గింగ్ రకాలూ కొన్ని అందుబాటులో ఉంటాయి. ఇవి శరీర ఆకృతిని అందంగా కనిపించేలా చేస్తాయి. వన్ పీస్ డ్రెస్సులకు ఇది ఉత్తమ ఎంపిక అనుకోవచ్చు. మోకాలు పొడవుండే స్కర్ట్స్, కాస్త పొట్టిగా ఉండే డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఇవి లోపల వేసుకుంటే చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ప్రయత్నించి చూడండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024