TG Govt Skills University : స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ రూ. 100 కోట్ల విరాళం

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ గ్రూప్‌ రూ. 100 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ… శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కున అందజేశారు.

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ యూనివర్శిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పారు. ఈ యూనివర్శిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఛైర్మన్ గా ఉన్నారు.

కొనసాగుతున్న ప్రవేశాలు :

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

తొలి విడతగా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్టు వర్శిటీ ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.

ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా చేరాల్సి ఉంటుంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ https://yisu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది. నవంబర్ 4వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా Hyderabad గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహిస్తారు.

లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేసేలా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.

Whats_app_banner

టాపిక్

Cm Revanth ReddyTelangana NewsEducationAdmissions
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024