Samyuktha Menon: ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Samyuktha Menon Comments: చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో ‘పొట్టేల్’ మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహించారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ పొట్టేల్ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ (అక్టోబర్ 18) పొట్టేల్ ట్రైలర్‌ను విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పొట్టేల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ సంయుక్త మీనన్.

నాలుగేళ్లు అంటే

“అందరికి నమస్కారం. ఐ లవ్ ద ట్రైలర్. మంచి కంటెంట్ ఎవరు చేసినా నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ సాహిత్ ఒక స్టోరీ మీద ఫోర్ ఇయర్స్ వర్క్ చేయడం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన క్వాలిటీలో స్క్రీన్ మీద తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి రైటింగ్, డైరెక్షన్ ఉంటేనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది” అని సంయుక్త మీనన్ తెలిపింది.

అథెంటింక్‌గా ఉంది

“ఈ పొట్టేల్ ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనిపించింది. చాలా అథెంటిక్‌గా ఉంది. ఇంత మంచి ఎఫర్ట్‌తో ఈ సినిమాని తీసిన యూనిట్ అందరికీ అభినందనలు. చాలా మంది కొత్త యాక్టర్స్ ఈ సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది. వెల్‌కమ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ” అని చెప్పుకొచ్చింది సంయుక్త మీనన్.

అద్భుతంగా పర్ఫామెన్స్

“నిర్మాత నిశాంక్ గారు ఈ సినిమా గురించి చెప్పినప్పుడు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనిపించారు. ఇలాంటి పాషన్ ఉన్న నిర్మాతలు ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాలి. యువ, అనన్యకి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. అజయ్ గారు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అని తన స్పీచ్ ముగుంచింది సంయుక్త మీనన్.

చదువు చెప్పమని

ఇదిలా ఉంటే, పొట్టేల్ ట్రైలర్‌లో తెలంగాణ సరిహద్దు దగ్గర హీరో, అతని కూతురు, టీచర్ వచ్చినప్పుడు అతని కాళ్లపై పడి తనకు చదువు చెప్పమని వేడుకునే సన్నివేశంతో ప్రారంభం అవుతుంది. ఇంతలో బలివ్వడానికి సిద్ధం చేసిన పొట్టేల్‌ని ఎవరో దొంగలిస్తారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, పటేల్ అజయ్ ఆదేశాలతో, హీరో కుటుంబంపై దాడి చేస్తారు.

మూఢ నమ్మకాలతో

పటేల్ అమ్మాయిని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. బాధలో ఉన్న హీరో జలపాతం వద్ద నిలబడి ప్రాణ త్యాగానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, విద్యకున్న ప్రాముఖ్యత పొట్టేల్ సినిమా ప్రధాన కథాంశంగా ఉందని ట్రైలర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024