Annu Kapoor Condom Ad: సీనియర్ నటుడి కండోమ్ యాడ్.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Best Web Hosting Provider In India 2024

Annu Kapoor Condom Ad: కండోమ్ యాడ్.. అందులోనూ ఓ సీనియర్ నటుడు.. ఇంకేం ఇంటర్నెట్ కు మంచి మసాలా దొరికినట్లయింది. అతనితో ఆడుకుంటున్నారు. ఒకప్పుడు దూరదర్శన్ లో యాంకర్ నుంచి బాలీవుడ్ లో నటుడిగా ఎదిగిన అన్నూ కపూర్ చేసిన కండోమ్ యాడ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అన్నూ కపూర్ కండోమ్ యాడ్

బాలీవుడ్ సీనియర్ నటుడు అన్నూ కపూర్ డ్యూరెక్స్ ఇండియా కండోమ్ యాడ్ లో నటించడం ఇప్పుడు ఇంటర్నెట్ లో చర్చనీయాంశమవుతోంది. కండోమ్ ఓ నిజమైన స్నేహితుడిలా మంచి చేస్తుందంటూ అతడు ఈ యాడ్ లో చెప్పే డైలాగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఊహించని యాడ్ తో ఇంటర్నెట్ యూజర్లు షాక్ తిన్నారు. చాలా మంది కొన్ని ఫన్నీ కామెంట్స్ తో అన్నూ కపూర్ ను ట్రోల్ చేశారు.

కండోమ్.. ఓ ఫ్రెండ్..

అన్నూ కపూర్ చేసిన ఈ యాడ్ మిగిలిన కండోమ్ యాడ్స్ తో పోలిస్తే పూర్తి భిన్నంగా సాగింది. కండోమ్స్ పై అవగాహన కల్పించేలా అతని డైలాగ్స్ ఉన్నాయి. “నిజమైన స్నేహితుడు ఎవరంటే.. ఎల్లవేళలా మీ వెంట ఉండేవాడు. అతడు మీ జీవితంలో ఎంత ఫిట్ అవుతాడంటే మీ శరీరంలో ఓ భాగంగా అనిపిస్తుంది.

వాళ్లతో ఉన్నప్పుడే సంతోషం ఎన్నో రెట్లు పెరిగినట్లు అనిపిస్తుంది. ప్రతి క్షణం వాళ్లు మీ కవచంగా మారి మిమ్నల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. డ్యూరెక్స్ క్లోజ్ ఫిట్ కండోమ్ మీ నిజమైన స్నేహితుడు” అనే డైలాగ్స్ తో అన్నూ కపూర్ అదరగొట్టాడు.

ఇంటర్నెట్ రియాక్షన్ ఇదీ

అన్నూ కపూర్ కండోమ్ యాడ్ పై ఇంటర్నెట్ ఫన్నీగా రియాక్ట్ అయింది. ఒక్కసారిగా టైమ్ మార్చేశావ్.. భావోద్వేగాలనూ మార్చేశావ్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇది రాజశ్రీ పాన్ మసాలా ఓ మూలన కూర్చొని ఏడుస్తోందని అనడం విశేషం.

అన్నూ కపూర్ ఆ పాన్ మసాలాకు చాలా ఏళ్లపాటు అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ యాడ్ చూసి క్యాన్సర్ పై అవగాహన అనుకున్నాను.. కానీ ఇది క్యాజువల్ తీరు కంటే చాలా భిన్నంగా ఉంది అని మరో యూజర్ అన్నారు. అన్నూ కపూర్ సినిమాల విషయానికి వస్తే అతడు ఈ మధ్యే అనుపమ్ ఖేర్ నటించిన ది సిగ్నేచర్ మూవీలో కనిపించాడు. ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024