Kcr Movie: కేసీఆర్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ – హీరోగా ఎంట్రీ ఇస్తోన్న జ‌బ‌ర్ధ‌స్థ్ కంటెస్టెంట్‌

Best Web Hosting Provider In India 2024


Kcr Movie: జ‌బ‌ర్ధ‌స్థ్ కంటెస్టెంట్ రాకింగ్ రాకేష్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. కేసీఆర్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. కేసీఆర్ మూవీ ట్రైల‌ర్ శ‌నివారం రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బావమ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌క‌థ‌తో ద‌ర్శ‌కుడు గ‌రుడ‌వేగ అంజి ఈ మూవీని తెర‌కెక్కించాడు.

కేశ‌వ చంద్ర ర‌మావ‌త్‌…

ఈ ట్రైల‌ర్‌లో కేశ‌వ చంద్ర ర‌మావ‌త్‌…షార్ట్‌క‌ట్‌లో కేసీఆర్ అని చైల్డ్ యాక్ట‌ర్ ఆదిత్య చెబుతూ క‌నిపించాడు. ఛోటా కేసీఆర్ అని ఓ ముస‌ల‌మ్మ పిల‌వ‌గానే రాకింగ్ రాకేష్‌ను చూపించారు. బావ‌మ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌క‌థ‌కు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? ఊరి కోసం ప‌ల్లెను విడిచి కేసీఆర్ సిటీకి ఎందుకు వెళ్లాల్సివ‌చ్చింద‌న్న‌ది ఎమోష‌న‌ల్‌గా చూపించారు.

ఊరు పోతుందంటే ఊపిరి పోయిన‌ట్లుగా ఉంద‌ని… ప‌ల్లెప్ర‌జ‌ల‌కు త‌మ ఊరితో ఉన్న మ‌మ‌కారాన్ని…ఊరు విడిచివెళ్లాల్సివ‌చ్చిన‌ప్పుడు వారు ఎదుర్కొనే బాధ‌ను కేజీఆర్ ట్రైల‌ర్‌లో ఆవిష్క‌రించారు. కేసీఆర్ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో రాకింగ్ రాకేష్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

హీరోగా…నిర్మాత‌గా…

కేసీఆర్ మూవీలో హీరోగా న‌టిస్తూనే ఈ మూవీకి నిర్మాత‌గాను వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు రాకింగ్ రాకేష్‌. స్క్రీన్‌ప్లేను అందించాడు. కేసీఆర్ మూవీలో అన‌న్య కృష్ణ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. చ‌ర‌ణ్ అర్జున్ మ్యూజిక్ అందించాడు. త్వ‌ర‌లోనే ఈమూవీ రిలీజ్ కాబోతోంది.

ఇళ్లు తాక‌ట్టు పెట్టి…

కేసీఆర్ మూవీని తాను నిర్మించ‌డానికి గ‌ల కార‌ణాల‌ను గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో రాకింగ్ రాకేష్ వెల్ల‌డించాడు. జ‌బ‌ర్ధ‌స్త్ షో ద్వారా ఇన్నేళ్లు సంపాదించుకున్న డ‌బ్బుతో పాటు క‌ష్ట‌ప‌డి క‌ట్టుకున్న‌ ఇళ్లును తాక‌ట్టు పెట్టి కేసీఆర్ మూవీ నిర్మించిన‌ట్లు తెలిపాడు.

జార్ధ‌ర్ సుజాత ప్రోత్సాహంతో…

తొలుత ఈ సినిమాకు నిర్మాత‌ను తాను కాద‌ని, సినిమా ప్రొడ్యూస్ చేస్తామ‌ని వ‌చ్చిన వాళ్లు వెన‌క్కి త‌గ్గ‌డంతో అనుకోని ప‌రిస్థితుల్లో తాను ప్రొడ్యూస‌ర్‌గా మారాల్సివ‌చ్చింద‌ని రాకింగ్ రాకేష్ తెలిపాడు. ఈ సినిమా నిర్మాణంలో కారును కూడా అమ్మాల్సివ‌చ్చింద‌ని రాకింగ్ రాకేష్ చెప్పాడు.

కేసీఆర్ మూవీ నిర్మాణంలో ఎన్నో క‌ష్టాలు ఎదుర‌య్యాయ‌ని, భార్య జోర్దార్ సుజాత‌తో పాటు త‌ల్లి త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని రాకింగ్ రాకేష్ గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

కేసీఆర్అభిమానుల్లో ఒక‌డిని…

కేసీఆర్ కోట్లాది మంది అభిమానుల్లో తాను ఒక‌డిన‌ని, అదే అభిమానంతోనే ఈ మూవీకి కేసీఆర్ అనే టైటిల్ పెట్టిన‌ట్లు చెప్పాడు. ఈ సినిమాకు రైట‌ర్‌గా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ జోర్దార్ సుజాత వ్య‌వ‌హ‌రించిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఏడాది పెళ్లి…

జ‌బ‌ర్ధ‌స్థ్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన రాకేష్ తెలుగులో ప‌లు చిన్న సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు. యాంక‌ర్ సుజాత‌తో టీవీ షోస్ చేస్తోన్న స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డంతో గ‌త ఏడాది ఈ జంట పెళ్లిపీట‌లెక్కారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024