Walk After Lunch: లంచ్ తర్వాత 10 నిమిషాల సింపుల్ నడకతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? డోంట్ మిస్

Best Web Hosting Provider In India 2024

మనలో చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తాపీగా కూర్చుండిపోతారు. కొంత మంది కాసేపు కునుకు కూడా తీస్తుంటారు. అయితే.. లంచ్ చేసిన వెంటనే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు నడిస్తే మీరు ఊహించని ప్రయోజనాల్ని ఇస్తుందట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు తగ్గుతాయి

భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల మీ జీర్ణశక్తి పెరుగుతుంది. మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి లంచ్ తర్వాత ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకంతో పాటు కొన్ని జీర్ణ సమస్యలు తప్పవు. కాబట్టి తిన్న తర్వాత కాసేపు నడవడం జీర్ణక్రియ మెరుగవుతుంది.

బీపీ, షుగర్ కంట్రోల్

భోజనం తర్వాత నడక మీ బ్లడ్ షుగర్, ఇన్సులిన్‌ను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. బీపీ, షుగర్ లాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటే భోజనం తర్వాత కాసేపు నడవడాన్ని అలవాటు చేసుకోండి. 

నడకతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకుని, మీ బరువుని కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. లంచ్ తర్వాత కాసేపు నడక సుమారు 150 కేలరీల్ని బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో పాటు ఈవినింగ్ స్నాక్స్, డ్రింక్స్ తాగాలనే మీ కోరికల్ని నియంత్రిస్తుంది.

ఎంత సేపు నడవాలి?

మధ్యాహ్న భోజనం తర్వాత నడక రాత్రి మంచి నిద్ర పడటానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ నడక శరీరంలో హార్మోన్ల సమతుల్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. 

మధ్యాహ్నం ఆ 10-15 నిమిషాల తర్వాత కాసేపు కునుకు కూడా మీరు తయవచ్చు. కానీ.. లంచ్ తర్వాత నిద్ర 15 నిమిషాలకి మించితే.. ఆ ప్రభావం రాత్రి నిద్రపై పడుతుంది. కాబట్టి.. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.

ఫ్రెష్ ఎయిర్‌లో కాసేపు

లంచ్ తర్వాత నడక మనసును ప్రశాంతంగా, హాయిగా ఉంచుతుంది. కాసేపు కొలీగ్స్‌తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ అలా ఆఫీస్ బయట లేదా గార్డెన్ ఏరియాలో కనీసం 10-15 నిమిషాలు నడవడం ద్వారా మీ ఒత్తిడి స్థాయినీ తగ్గించుకోవచ్చు. 

బయట నడవడం వల్ల శరీరానికి ఫ్రెష్ ఎయిర్ అందుతుంది. అలానే మీ కొలీగ్స్‌తో మీకు మంచి అనుబంధం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని విషయాలూ ఆఫీస్‌లో మాట్లాడుకోలేం కదా. ఒకవేళ మీకు కొలీగ్స్‌తో వెళ్లడం ఇష్టం లేకపోతే సరదాగా మ్యూజిక్ వింటూ లేదా ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ కాసేపు నడవండి. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. ఇది వైద్యపరమైన సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024