Thriller Web Series: అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతోన్న న‌వీన్ చంద్ర డార్క్ థ్రిల్ల‌ర్ సిరీస్ – ఆరు భాష‌ల్లో స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

Thriller Web Series: టాలీవుడ్ హీరో న‌వీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన స్నేక్స్ అండ్ ల్యాడ‌ర్స్ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నేష‌న‌ల్ వైడ్‌గా టాప్ 2లో నిలిచింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ క‌లిసి కోలీవుడ్ డైరెక్ట‌ర్ కార్తిక్ సుబ్బ‌రాజు ప్రొడ్యూస్ చేశాడు.

ఈ వెబ్‌సిరీస్‌కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమల ఆల్కెమిస్ వహించారు. స్నేక్స్ అండ్ ల్యాడ‌ర్స్ వెబ్‌సిరీస్‌లో నవీన్ చంద్రతో పాటు నందా, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, శ్రీజిత్ రవి కీల‌క పాత్ర‌లో పోషించారు. శుక్ర‌వారం (అక్టోబర్ 18) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

న‌లుగురు స్నేహితుల చుట్టూ…

ఒకే స్కూల్‌లో చ‌దువుతున్న న‌లుగురు స్నేహితుల చుట్టూ ఈ క‌థ సాగ‌నుంది. ఓ దొంగ‌ను వారు ఎలా హ‌త‌మార్చారు. ఆ దొంగ ద‌గ్గ‌ర ఉన్న బ్యాగ్‌ కోసం న‌లుగురు పిల్ల‌ల‌ను ఓ గ్యాంగ్‌స్ట‌ర్ ఎందుకు వెంటాడు? ఆ బ్యాగ్‌లో ఏముంది? వారిని ర‌క్షించిన వ్య‌క్తి ఎవ‌రు అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.

అమెజాన్ ప్రైమ్‌లో…

స్నేక్స్ అండ్ ల్యాడ‌ర్స్ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ కావ‌డం ప‌ట్ల న‌వీన్ చంద్ర ఆనందం వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘ ఓ నలుగురు టీనేజ్ పిల్లలు, వారి జీవితంలో వచ్చిన ఓ అనూహ్య ఘటన, దాని నుంచి బయటకు రావడం అనే పాయింట్‌తో కార్తిక్ సుబ్బరాజ్ టీం ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించింది.

అమెజాన్ ప్రైమ్‌తో ఇది నా మూడో ప్రాజెక్ట్. నాకు ఇంత మంచి ఆఫర్లు ఇస్తున్న అమెజాన్ టీంకు థాంక్స్. ముగ్గురు దర్శకులు ఈ వెబ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచారు. మూడు షిఫ్టుల్లో పని చేశారు. షూట్ మొత్తం కొడైకెనాల్‌లో చేశాం. ఆరు భాషల్లో ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో సహా ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.

డార్క్ హ్యూమ‌ర్‌…

నటుడు నంద మాట్లాడుతూ.. ‘ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన డార్క్ హ్యూమర్ సిరీస్ ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. కమర్షియల్ అంశాలన్నీ కూడా ఉంటాయి. 9 ఎపిసోడ్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి.నవీన్ చంద్ర వంటి అద్భుతమైన నటుడితో పని చేయడం ఆనందంగా ఉంద‌ని రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌మ‌ల అన్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024