Anasuya Bharadwaj: అనసూయ ఒక అమ్మలా చూసుకున్నారు.. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Rocking Rakesh About Anasuya Bharadwaj: జబర్దస్త్ కమెడియన్‌గా ఎంతో పాపులర్ అయ్యాడు రాకింగ్ రాకేష్. తాజాగా రాకింగ్ రాకేష్ హీరోగా చేసిన సినిమా ‘కేశవ చంద్ర రమావత్’. షార్ట్ కట్‌లో కేసీఆర్. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది.

కేశవ చంద్ర రమావత్ ట్రైలర్ రిలీజ్

రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించిన కేసీఆర్ చిత్రం లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ నుంచి స్ఫూర్తి పొందింది. తాజాగా కేసీఆర్ ట్రైలర్‌ను (కేశవ చంద్ర రమావత్ ట్రైలర్) విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా యాంకర్ అనసూయ భరద్వాజ్ హాజరైంది.

మూడు ఫిలిం ఫెస్టివల్స్‌లో

కేసీఆర్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌లో హీరో రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమాని మూడు ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించాలనేది నా కోరిక. దానికి మీరందరి సపోర్ట్ కావాలి. సాయి రాజేష్ అన్నకు ఎంత థాంక్స్ చెప్పుకున్న తక్కువే. సాయి రాజేష్ అన్నకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని చెప్పాడు.

చాలా ప్యాషన్‌తో

“అనసూయ గారు నన్ను జీరో దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఒక అమ్మలా చుసుకున్నారు. వారు ఈ ఈవెంట్‌కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ అంజి అన్న సినిమాని చాలా ప్యాషన్‌తో తీశారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఒక బిడ్డ లాగా అన్ని నేర్పించారు. ఎన్ని క్రాఫ్ట్‌లు ఉన్నాయో అన్ని క్రాఫ్ట్‌లు నేర్పించారు” అని రాకింగ్ రాకేష్ తెలిపాడు.

నా సక్సెస్‌కు కారణం

“చరణ్ అర్జున్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన త్వరలో బిగ్ బ్యానర్స్‌లో పనిచేయబోతున్నారు. నా సక్సెస్‌కు కారణం నా భార్య సుజాత. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాలో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు” అని రాకింగ్ రాకేష్ వెల్లడించాడు.

డబ్బులు సంపాదిస్తే

అనంతరం అనసూయ మాట్లాడుతూ.. “మీడియాకి థాంక్యూ. రాకేష్ నా తమ్ముడు లాంటివాడు. చాలా హానెస్ట్‌గా ఈ సినిమా తీశారు. రెండు డబ్బులు సంపాదిస్తే ఇల్లు, కారు కొనుక్కోవాలి అనుకుంటారు. కానీ, రాకేష్ మాత్రం ఒక మంచి సినిమా తీయాలనుకున్నాడు, ట్రైలర్ చాలా బాగుంది. చాలా ప్రౌడ్‌గా అనిపించింది” అని చెప్పింది.

అలాగే రిసీవ్ చేసుకోవాలి

“డైరెక్టర్ అంజి గారు చాలా బ్రిలియంట్‌గా ఈ కథని తీశారు. చరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాకేష్ చాలా హానెస్ట్‌గా ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఆడియన్స్ కూడా అంతే హానెస్ట్‌గా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్” అని యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలిపింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024