Failure Meet: సినిమాకు ‘ఫెయిల్యూర్ మీట్’ నిర్వహించిన మూవీ టీమ్.. కారణం ఏంటో చెప్పిన నిర్మాత

Best Web Hosting Provider In India 2024

సాధారణంగా సినిమాలకు సక్సెస్ మీట్‍లు జరుగుతుంటాయి. తమ మూవీ మంచి ఓపెనింగ్స్ సాధించిందంటూ రిలీజ్ తర్వాత మూవీ టీమ్‍లు ఈవెంట్ నిర్వహిస్తుంటాయి. కొన్ని సినిమాలకు అంచనాలకు తగ్గట్టు ఫలితాలు రాకపోయినా సక్సెస్ ఈవెంట్లు జరుగుతుంటాయి. అయితే, తాజాగా వచ్చిన ఈ మూవీకి మాత్రం ఫెయిల్యూర్ మీట్ నిర్వహించి ఆశ్చర్యపరిచింది టీమ్. లవ్ రెడ్డి సినిమా అనుకున్న విధంగా కలెక్షన్లు దక్కించుకోకపోవటంతో ఫెయిల్యూర్ మీట్ జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

అంజన్ రామచంద్ర, శ్రావణి కృష్ణవేణి హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ రెడ్డి సినిమా ఈ శుక్రవారం (అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజైంది. అయితే, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రమోషన్లను జోరుగా చేసినా.. అనుకున్న స్థాయిలో ఓపెనింగ్ రాలేదు. దీంతో “బ్లాక్‍బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్” అంటూ నేడు (అక్టోబర్ 19) ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్.

భయం లేదు

ఫెయిల్యూర్ పేరుతో ఈ మీట్ పెట్టడానికి తనకు అసలు భయం లేదని లవ్ రెడ్డి మూవీ నిర్మాత మదన్ గోపాల్ రెడ్డి చెప్పారు. ప్రేక్షకుల వద్దకు సినిమాను ఎలాగైనా తీసుకెళ్లాలనే కారణంతోనే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. “ఈ మీట్ పెట్టడానికి నాకు భయం లేదు. డబ్బులు నేను పదేళ్లయినా సంపాదించుకుంటా. నేను గెలిచే బయటికి వెళ్లాలని ఈ మీట్ పెట్టా. ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే నేను ఏదో ఒకటి చేసి వెళ్లాలి. మూడేళ్లు ఈ సినిమా కోసం నేను కష్టపడ్డా” అని ఆయన అన్నారు.

ఫెయిల్యూర్ పేరుతో అయినా ప్రేక్షకుల వద్దకు ఈ చిత్రాన్ని తీసుకెళతామని మదన్ గోపాల్ తెలిపారు. “ఈ సినిమా కోసం హీరోహీరోయిన్ అందరూ పదేళ్లు కష్టపడ్డారు. నాకు మూడేళ్లు అనేది పెద్ద విషయం కాదు. మా వాడు గెలవాలి. అందుకే నేను ఈ మీట్ పెట్టా. ఆ ఫెయిల్యూర్‌ను కూడా ప్రేక్షకుల వద్దకు తీసుకెళతా” అని మదన్ చెప్పారు.

ఏం చేయాలో..

తమ సినిమా హీరో, హీరోయిన్, డైరెక్టర్ గెలిచారని మదన్ మోహన్ చెప్పారు. ఫెయిల్యూర్ మీట్ నిర్వహించాలనే నిర్ణయం తనదేననని తెలిపారు. సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. ప్రీమియర్ షో చూసిన అందరూ ఈ చిత్రం బాగుందని తనకు చెప్పారని, సినిమాలో జనాల్లోకి తీసుకెళ్లాలని అన్నారని వెల్లడించారు. ఫ్రీ షో చూసిన వాళ్లు కూడా కొందరు తనకు ఫోన్‍పే చేశారని కూడా ఆయన తెలిపారు.

ఫెయిల్యూర్‌ను తాను అంగీకరిస్తానంటూ ఎమోషనల్‍గా మాట్లాడారు మదన్. తన మూవీ హీరో, హీరోయిన్, డైరెక్టర్ గెలిచినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సినిమాను ప్రేక్షకుల వద్దకు ఇంకా ఎలా తీసుకెళ్లాలో అర్థం కావడం లేదని, గత రాత్రి నిద్ర రాలేదని తెలిపారు.

లవ్ రెడ్డి మూవీని మదన్ గోపాల్ రెడ్డితో పాటు సునంద బీ, హేమలతా రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ప్రమోషన్లను మూవీ టీమ్ గట్టిగా నిర్వహించింది. మంచి బజ్ ఏర్పడింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు హీరో కిరణ్ అబ్బవరం కూడా హాజరయ్యారు. అయితే, లవ్ రెడ్డి చిత్రానికి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్ దక్కలేదు. మరి ఈవెంట్ తర్వాత వసూళ్లు పుంజుకుంటాయేమో చూడాలి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024