Devara Collection: రోజూ కోటికిపైగా దేవర నెట్ కలెక్షన్స్.. 22 రోజుల్లో వచ్చిన ప్రాఫిట్ ఎంతంటే?

Best Web Hosting Provider In India 2024

Devara Day 22 Box Office Collection: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకు ఇండియాలో 22వ రోజు రూ. కోటి ఐదు లక్షల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అయితే, 21వ రోజుతో పోల్చుకుంటే 22వ రోజు దేవర వసూళ్లు తగ్గిపోయాయి. అది కూడా 19.23 శాతం వరకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ తగ్గాయి.

దేవర 22 డేస్ కలెక్షన్స్

కానీ, ప్రతి రోజు కోటికిపైగా నెట్ కలెక్షన్స్ కొల్లగొడుతూ సత్తా చాటుతోంది దేవర చిత్రం. ఇక ఓవరాల్‌గా 22 రోజుల్లో భారతదేశంలో దేవర సినిమాకు రూ. 281.65 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. అందులో తెలుగు నుంచి 211.42 కోట్లు, హిందీ ద్వారా 6.87 కోట్లు, కర్ణాటక నుంచి 2.04 కోట్లు, తమిళనాడు నుంచి 5.97 కోట్లు, మలయాళంలో రూ. 1.35 కోట్ల కలెక్షన్స్ సాధించింది దేవర చిత్రం.

వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్స్

అలాగే, ఇండియాలో దేవర సినిమాకు 22 డేస్‌లో రూ. 333.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్‌గా వచ్చిన నెట్ కలెక్షన్స్ రూ. 412 కోట్లుగా ఉన్నాయి. ఇక ఒక్క తెలుగు రాష్ట్రాల్లో 22వ రోజున రూ. 60 లక్షలు వసూలు అయ్యాయి. ఇలా మొత్తంగా 22 రోజుల్లో ఏపీ, తెలంగాణలో దేవర సినిమా రూ. 157.23 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 227.90 కోట్ల గ్రాస్ రాబట్టింది.

దేవర గ్రాస్ కలెక్షన్స్

ఇక కర్ణాటకలో 17.88 కోట్లు, తమిళనాడులో 4.15 కోట్లు, కేరళలో 97 లక్షలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 34 కోట్లు, ఓవర్సీస్‌లో 35.98 కోట్ల షేర్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి దేవర సినిమాకు. అన్ని కలుపుకుని దేవర చిత్రానికి 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 250.21 కోట్ల షేర్, రూ. 511 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

దేవర ప్రాఫిట్

ఇక దేవర సినిమా లాభాల విషయానికొస్తే.. మూవీకి ఓవరాల్‌గా రూ. 182.25 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో 184 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అమౌంట్‌ మార్క్ ఎప్పుడో దాటి లాభాల వైపు పయనిస్తోంది దేవర చిత్రం. మొత్తంగా 22 రోజుల్లో దేవర సినిమాకు 66.21 కోట్ల మేర ప్రాఫిట్ వచ్చాయి.

బాలీవుడ్ హీరోయిన్

ఇదిలా ఉంటే, దేవర సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. బాలీవుడ్ హాట్ బ్యూటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేసింది. తొలిసారి దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. అలాగే, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ప్లే చేశాడు. ఆచార్య తర్వాత దేవర సినిమాకు దర్శకత్వం వహించారు డైరెక్టర్ కొరటాల శివ.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024