Anushka: సైలెంట్‌గా మ‌ల‌యాళం డెబ్యూ మూవీ షూటింగ్ పూర్తి చేసిన అనుష్క – మాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ ఫిల్మ్‌ ఇదే

Best Web Hosting Provider In India 2024

Anushka: అనుష్క శెట్టి త్వ‌ర‌లోనే హీరోయిన్‌గా మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. క‌థ‌నార్ పేరుతో పీరియాడిక‌ల్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో క‌థ‌నార్ మూవీ తెర‌కెక్కుతోంది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న‌ మూవీగా క‌థ‌నార్ రిలీజ్‌కు ముందే ఆడియెన్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

గుమ్మ‌డికాయ కొట్టేశారు…

గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఈ పీరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ షూటింగ్ మొద‌లైంది. తాజాగా ఈ సినిమాకు గుమ్మ‌డికాయ కొట్టేశారు. క‌థ‌నార్ షూటింగ్ పూర్త‌యిన‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ క‌లిసి దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

మొత్తం 212 రోజుల పాటు క‌థ‌నార్ షూటింగ్‌ను జ‌రిపిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో క‌థ‌నార్ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

జ‌య‌సూర్య హీరో…

క‌థ‌నార్ సినిమాలో జ‌య‌సూర్య హీరోగా న‌టిస్తోన్నాడు. ప్ర‌భుదేవా, వినీత్ కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు.9వ శ‌తాబ్దానికి చెందిన క‌డ‌మ‌ట‌ట్టు క‌థ‌నార్ అనే క్రిస్టియ‌న్ ప్రీస్ట్ జీవితం ఆధారంగా క‌థ‌నార్‌ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. అత‌డి జీవితం వెన‌కున్నర‌హ‌స్యాలు ఏమిటి?

ప్ర‌తీకారంతో ర‌గిలిపోతున్న ఓ ఆత్మ‌కు అత‌డు ఎందుకు సాయ‌ప‌డ్డాడు అనే అంశాల చుట్టూ క‌థ‌నార్ మూవీ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో అనుష్క ఆత్మ‌గా, ధైర్య‌సాహ‌సాలు క‌ల‌బోసిన యోధురాలిగా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ప‌ద‌మూడు భాష‌ల్లో రిలీజ్‌…

మ‌ల‌యాళంలో హీరోయిన్‌గా అనుష్క‌కు ఇదే ఫ‌స్ట్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన 18 త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ ఓ మ‌ల‌యాళ మూవీలో అనుష్క న‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. క‌థ‌నార్ సినిమాను ప‌ద‌మూడు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు. ఇండియ‌న్ లాంగ్వేజెస్‌తో పాటు ఇంగ్లీష్ కొరియ‌న్‌, జ‌పాన్‌, చైనీస్‌, ర‌ష్య‌న్ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి…

దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత గ‌త ఏడాది రిలీజైన మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది అనుష్క‌. స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించిన ఈ మూవీ యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో…

ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఘాటి పేరుతో ఓ మూవీ చేస్తోంది అనుష్క‌. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ షూటింగ్ పూర్తికాకుండా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ ఘాటి మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ది. ఘాటి మూవీ కోస‌మే ప‌వ‌న్ క‌ళ్యాన్ హ‌రి హ‌రి వీర‌మ‌ల్లు నుంచి మ‌ధ్య‌లోనే క్రిష్ వైదొలిగాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024