Best Web Hosting Provider In India 2024
యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం జోరు మీద ఉన్నారు. ఇప్పటికే ఈ ఏడాది విశ్వక్ నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు మంచి రిజల్ట్స్ సాధించాయి. ఇక విశ్వక్ నుంచి మరో సినిమా వచ్చేస్తోంది. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ మూవీ చేస్తున్నారు విశ్వక్. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమా నుంచి నేడు (అక్టోబర్ 20) ట్రైలర్ రిలీజ్ అయింది.
ఇద్దరు హీరోయిన్లతో..
మెకానిక్ రాకీ చిత్రంలో విశ్వక్ సేన్ తండ్రి పాత్రను నరేశ్ పోషించారు. ఓ మెకానిక్ షెడ్ నడుపుతుంటారు నరేశ్. తాను సివిల్ ఇంజినీర్ అవుతానని నరేశ్‌తో విశ్వక్ చెప్పడంతో ఈ ట్రైలర్ మొదలైంది. “సివిల్ ఇంజినీరా.. కంప్యూటర్ సైన్స్ చదివి” అని నరేశ్ అంటారు. తన కొడుకు దేనికీ పనికి రాడని చెబుతుంటారు. ఆ తర్వాత మెకానిక్, డ్రైవింగ్ స్కూల్ పనులను విశ్వక్‌కు నరేశ్ అప్పజెపుతాడు.
డ్రైవింగ్ నేర్చుకునేందుకు వచ్చిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌తో విశ్వక్ గొడవ పడతాడు. మీనాక్షి చౌదరిని లవ్‌లో దింపేందుకు విశ్వక్ ట్రై చేస్తుంటాడు. రోజూ గిఫ్టులు ఇస్తుంటాడు. అంబేద్కర్ జయంతికి కూడా గిఫ్ట్ తెచ్చానని చెబుతాడు. శ్రద్ధా శ్రీనాథ్తోనూ లవ్‌లోకి వెళ్లాడనేలా ట్రైలర్లో ఉంది.
యాక్షన్ మోడ్
మెకానిక్ షెడ్‌ను దౌర్జన్యంగా సొంతం చేసుకునేందుకు కొందరు రావటంతో విశ్వక్ యాక్షన్ మోడ్‌లోకి వెళతాడు. ఆ తర్వాత ట్రైలర్లో యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. అగ్రెషన్‌తో యాక్షన్ అదరగొట్టాడు విశ్వక్. “రిపేరుకు వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా.. సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా. అంతకు మించి మొండికి వేస్తే మాత్రం ఒక్కొక్కడి ఇంజిన్ తీసి కూష్మాండంలో బిగిస్తా” అంటూ విశ్వక్ మాస్ డైలాగ్ ఉంది. “నువ్వు రంకి రెడ్డి అయితే నేను రంకు రెడ్డి” అంటూ సునీల్‌కు వార్నింగ్ ఇస్తాడు. ఈ చిత్రం సునీల్ విలన్ అని అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లోనూ పంచ్ వేశాడు విశ్వక్.
ముందు కామెడీ, లవ్ ట్రాక్‌లు, ఆ తర్వాత యాక్షన్‌తో మెకానిక్ రాకీ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది. విశ్వక్ యాక్టింగ్, యాక్షన్‌తో మెప్పించారు. ఈ మూవీకి రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహించారు. కమర్షియల్ ఎంటర్టైనర్గానే ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నట్టు అర్థమవుతోంది. మెకానిక్ షెడ్‌ను విలన్ల నుంచి రక్షించుకోవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుందని ట్రైలర్‌తో తెలుస్తోంది. ఈ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.
మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్‌ను 1.0 పేరుతో మూవీ టీమ్ తీసుకొచ్చింది. దీంతో మరో ట్రైలర్ కూడా రానుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. నరేశ్, సునీల్‌తో పాటు హైపర్ ఆది, వైవా హర్ష కూడా కీరోల్స్ చేశారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రవి తాళ్లూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.