The Raja Saab: రాజా సాబ్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ వచ్చేస్తోంది.. ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్ మారుతి

Best Web Hosting Provider In India 2024

రెబల్ స్టార్ ప్రభాస్ మరో మూడు రోజుల్లో అక్టోబర్ 23న తన 45వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈసారి ప్రభాస్ బర్త్ డే సందడి మరింత ఎక్కువగా ఉంది. ఈశ్వర్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు థియేటర్లలో మళ్లీ రీ-రిలీజ్ అవుతున్నాయి. సలార్ చిత్రం స్పెషల్ షోలు కూడా ప్రదర్శితం కానున్నాయి. మొత్తంగా బర్త్ డే హంగామా గట్టిగా ఉండనుంది. ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం నుంచి పుట్టిన రోజు సందర్భంగా ఏ అప్‍డేట్ వస్తుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ తరుణంలో డైరెక్టర్ మారుతీ ఓ గుడ్‍న్యూస్ చెప్పారు.

ఎస్‍కేఎన్ ట్వీట్‍తో..

ప్రభాస్ పుట్టిన రోజు వస్తుండటంతో ది రాజా సాబ్ నుంచి స్టిల్ రిలీజ్ చేయాలని నిర్మాత ఎస్‍కేఎన్ నేడు ట్వీట్ చేశారు. “మరి ప్రభాస్ బర్త్‌డే అంటే హోర్డింగ్‍లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు.. అబ్బో చాలా హంగామా ఉంటుందిగా.. మరి మనం ఎందుకు కొత్త స్టిల్ రిలీజ్ చేయకూడదు” అంటూ డైరెక్టర్ మారుతీ, ఈ మూవీని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎస్‍కేఎన్ ట్యాగ్ చేశారు. దీంతో మారుతీ స్పందించారు.

రేపే ఇచ్చేద్దాం

ది రాజా సాబ్ నుంచి కొత్త స్టిల్‍ను రేపే (అక్టోబర్ 21) ఇచ్చేద్దామంటూ మారుతీ రిప్లై ఇచ్చారు. “రేపు ఇచ్చేద్దాం. డార్లింగ్ నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అందరి కోసం” అని ట్వీట్ చేశారు. అయితే, రేపు ఏ సమయానికి ఈ స్పెషల్ పోస్టర్ రానుందో మారుతీ వెల్లడించలేదు.

ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న ఉండగా.. రెండు రోజుల ముందే ది రాజా సాబ్ నుంచి స్పెషల్ స్టిల్ రానుంది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నయా పోస్టర్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ భారీగా ఉంది.

ది రాజా సాబ్ సినిమాను హారర్ రొమాంటిక్ కామెడీ మూవీగా డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మారుతి పుట్టిన రోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ప్రభాస్ లుక్ హైలైట్‍గా నిలిచింది.

ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2025 ఏప్రిల్ 10వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

ప్రభాస్ లైనప్‍లో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ది రాజాసాబ్ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. హను రాఘవపూడితో ఓ చిత్రానికి అంగీకరించారు. పుట్టిన రోజున ఈ చిత్రాల నుంచి అప్‍డేట్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, సలార్ 2, కల్కి 2 సినిమాలను కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. ఇలా వరుస సినిమాలతో సుమారు నాలుగేళ్ల వరకు ఫుల్ బిజీగానే ఉండనున్నారు ప్రభాస్.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024