War 2 Title: ఎన్టీఆర్, హృతిక్ ‘వార్-2’కు తెలుగులో టైటిల్ వేరుగా ఉండనుందా? క్లారిటీ ఇదే!

Best Web Hosting Provider In India 2024


మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ భారీ కలెక్షన్లను సాధిస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇంకా జోరు చూపిస్తోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీతోనే బాలీవుడ్‍లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరో హృతిక్ రోషన్‍తో కలిసి ఆయన నటిస్తున్నారు.

తెలుగు టైటిల్‍పై రూమర్లు

వార్ 2 చిత్రానికి తెలుగులో టైటిట్ వేరుగా ఉంటుందని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ చిత్రం తెలుగులో ‘వార్ 2 – యుద్ధభూమి’ పేరుతో వస్తోందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ టైటిల్ మూవీ టీమ్ రిజిస్టర్ చేయించిందనే ఊహాగానాలు వచ్చాయి.

నిజమిదే!

వార్ 2 చిత్రాన్ని తెలుగులో వేరే టైటిల్‍తో తీసుకొచ్చే ఆలోచనలో మూవీ టీమ్ లేదని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే ‘వార్ 2’ టైటిల్ జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘వార్’ కూడా అదే పేరుతో తెలుగులో వచ్చింది. ‘వార్ 2’ను కూడా తెలుగులో అదే టైటిల్‍తో రిలీజ్ చేయాలనే మేకర్స్ భావిస్తున్నారని, వేరే టైటిల్‍తో వస్తుందనే రూమర్లలో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలిసింది.

ముంబైలో ఎన్టీఆర్

వార్ 2 సినిమా షూటింగ్‍ కోసం ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉంటున్నారు. ఇటీవలే ఆయన ముంబైకి వెళ్లారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2025 ఆగస్టు 14వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది.

వార్ 2 మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగానే వార్ 2 తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ మూవీ ఉండనుంది.

టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండటంతో వార్ 2 చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ నెలకొంది. ఈ మూవీలో కియారా అడ్వానీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తదుపరి ప్రశాంత్ నీల్‍తో ఓ హైవోల్టేజ్ యాక్షన్ మూవీ చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే మొదలుకానుంది. వార్ 2లో తన భాగం చిత్రీకరణను ఎన్టీఆర్ త్వరలోనే పూర్తి చేసుకోనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‍తో మూవీ షూటింగ్ షురూ కానుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024