Brahmamudi Today Episode: అపర్ణ దెబ్బ, ఖంగుతిన్న అనామిక- 50 లక్షలతో కేస్ క్లోజ్- లేడి బాస్‌గా కావ్య, మేనేజర్‌గా రాజ్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య మాటలకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్లిపోతామంటే సరేనంటుంది కళావతి. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఆగండి నేను చూసుకుంటాను అని కావ్యను లేపి తిడుతుంది. నువ్వేందుకు ఓవర్ చేస్తున్నావ్ క్యాన్సర్ కనకం. వాళ్లే వెళ్తామంటున్నారు అని కావ్య అంటుంది.

ఎంత లోకువ అయ్యాం

అవును, నువ్ వెళ్లమన్న వెళ్లం. మేము ఇంకో ప్లాన్‌తో వచ్చాం అని అపర్ణ అంటుంది. మరో నాటకానికి తెరదించారన్నమాట అని కావ్య అంటుంది. జీవితం అంటేనే నాటకం. తగినట్లు జీవించాలి అని కనకం అంటుంది. మేము అద్భుతమైన పరిష్కారంతో వచ్చాం అని అపర్ణ అంటే.. ముందు చెప్పండి అది అద్భుతమో.. అదో భూతమో నేను చెబుతాను అని కావ్య అంటుంది. హుమ్.. ఎంత లోకువ అయ్యాం మేము అని అపర్ణ అంటుంది.

క్షమించండి అత్తయ్య మీరు లోకువ అవ్వడం ఏంటీ. మీరు వెనుక ఉండి నడిపించిన ఆయనకు ముందు కనపడేది నేనే అని కావ్య బాధగా జరిగింది చెబుతుంది. భర్తకు దూరంగా ఉండి పుట్టింట్లో ఏం చేస్తావ్ అని ఇందిరాదేవి అంటుంది. బొమ్మలకు రంగులేస్తాను. మా నాన్నకు తోడుగా ఉంటాను అని కావ్య అంటుంది. నువ్ కంపెనీలో మళ్లీ జాయిన్ అవ్వాలి. నీలో కనపడని ఝాన్సీ లక్ష్మీ భాయ్, రుద్రమదేవి ఉన్నారు. కాబట్టి, చేయని తప్పుకు ఇలా తలవంచి మౌనంగా ఉంటే సరిపోదు అని అపర్ణ అంటుంది.

నీ టాలెంట్‌కు సరైనా గుర్తింపు కావాలి. వాడి తప్పు వాడు తెలుసుకోవాలి అని అపర్ణ అంటుంది. నువ్ అనుకుంటే సాధిస్తావ్ అనుకుంటున్నాం. నిందను అలాగే నిందలా ఉండనినిస్తావా. నువ్ ఏ తప్పు చేయలేదని నిరూపించలేవా. నా మనవడు అనుమానిస్తే అలాగే తప్పు ఒప్పేసుకుంటావా అని ఇందిరాదేవి అంటుంది. నువ్ దుగ్గిరాల ఇంటి కోడలివి అయి వేరే కంపెనీకి పనిచేస్తేనే కదా ప్రపంచానికి రాయడానికి సమాచారం దొరికింది. ఇప్పుడు అదే కంపెనీలో పని చేస్తే అవన్నీ పుకార్లు అవుతాయ్ కదా అని అపర్ణ అంటుంది.

తప్పు వెతుకుతారు

నా వల్ల దుగ్గిరాల ఇంటి పరువు పోయింది. అది తప్పే ఒప్పుకుంటాను. అది ఆ అనామిక బిగించిన ఉచ్చు. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తే.. ప్రతి చిన్న విషయంలో తప్పు వెతికి అనుమానిస్తుంటారు. దిన దిన గండ నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు రోజుకో ఓ గంట ఎదుర్కొంటూనే ఉండాలి. నా ఆత్మ గౌరవం కోసం పోరాడుతూనే ఉండాలి. అయినా ఏ నమ్మకంతో పిల్లిని, ఎలుకను బోనులో వదలాలని అనుకుంటున్నారు. బలవంతంగా నన్ను ఆఫీస్‌లో కూర్చోబెట్టిన ఎందులో ఏ తప్పు వెతుకుతారో తెలీదు. ఎప్పుడు గెంటేస్తారో తెలియదు అని కావ్య అంటుంది.

అవకాశం లేకపోయినా కల్పించుకుని మరి అంటారు. నావల్ల కాదు అత్తయ్య. ఆలోచించుకోండి అని కావ్య అంటుంది. పదా. ఆలోచించుకుని వద్దాం అని అపర్ణ, కనకం, ఇందిరాదేవి పక్కకు వెళ్తారు. ముగ్గురు ఏదో మాట్లాడుకుని మళ్లీ కావ్య దగ్గరికి వస్తారు. అద్భుతమైన ఆలోచన చేశాం. నువ్ వాడి కింద పనిచేస్తేనే కదా సమస్య. అదే కంపెనీకి నువ్ సీఈఓ అయితే.. అని అపర్ణ అంటుంది. అవునా నిజమా. అంతపెద్ద కంపెనీకి సీఐడీగా పనిచేస్తుందా అని కనకం సంతోషంతో షాక్ అవుతుంది.

మీరు చాలా మంచి నిర్ణయం అనుకుంటున్నారు. కానీ, దానివల్ల మా మధ్య మరింత దూరం పెరుగుతుంది. మిమ్మల్ని మభ్యపెట్టి నేను పగ సాధిస్తున్నాను అనుకుంటారు. ఇది కూడా బెడిసికొడుతుంది అత్తయ్య అని కావ్య అంటుంది. నీకు ధైర్యం లేదని చెప్పు. వాడికి భయపడుతున్నానని చెప్పు. చేయని తప్పుకు నిందలు పడుతూ బొమ్మలకు రంగులువేసుకుంటూ ఉండు అని ఇందిరాదేవి అంటుంది. వాడు ఇగోకి పోయి బిజినెస్ మ్యాన్‌లా ఆలోచించట్లేదు అని అపర్ణ అంటుంది.

ఇష్టం లేకుండానే

మీ తాతయ్యకు కంపెనీ గురించి దిగులు ఎక్కువ అయింది. అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ సమయంలో వాడికి నీ సహాకారం కావాలి అని ఇందిరాదేవి అంటుంది. కానీ, ఆయన మనసులో నేను లేనుగా దాని విషయం ఏంటీ అని కావ్య అంటుంది. ఏయ్ ఏంటే. ఇంతపెద్దవాళ్లు వచ్చి అడుగుతుంటే కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నావ్. నీ మీద ఇష్టంలేకుండానే దాంపత్య వ్రతం మీద కూర్చున్నారా. కావ్య వస్తుంది అని కనకం అంటుంది.

ఇంతలో చప్పట్లు కొడుతూ అనామిక వచ్చి ట్విస్ట్ ఇస్తుంది. అనామికను చూసి నలుగురు షాక్ అవుతారు. ఎంత గొప్ప మనసు మీది. అలిగి పుట్టింటికి వచ్చిన కోడలిని ఏకంగా సీఈఓను చేయాలనుకుంటున్నారు. కానీ, ఎవరి ఎంప్లాయ్‌ను ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు. కావ్య నా కంపెనీలో పనిచేస్తుంది. దానికి నేను ఒప్పుకోవాలి కదా అని అనామిక అంటుంది. నువ్వు ఒప్పుకోవడం ఏంటే నీ మొహం అని ఇందిరాదేవి అంటుంది.

కావ్య మీ కంపెనీలో జాయిన్ అయితే నేను నేరుగా కోర్ట్‌కు వెళ్లి కేసు పెడతా అని అనామిక అంటుంది. కేసు పెట్టడానికి నీ దగ్గర ఏం కారణం ఉంది అని అపర్ణ అంటుంది. నీ కోడలు సంతకం చేసిన అగ్రిమెంట్ ఉంది. మా కంపెనీకి రెండేళ్లు పనిచేస్తున్నట్లు రాసిన అగ్రిమెంట్ చూపించి జైలుకు పంపిస్తా. అప్పుడేం చేస్తారు అని పేపర్స్ చూపిస్తుంది అనామిక. అప్పుడెందుకు ఇప్పుడే చేస్తాం అని పేపర్స్ తీసుకుంటుంది అపర్ణ. చించేస్తారేమో కాపీస్ చాలా ఉన్నాయని అనామిక అంటుంది.

50 లక్షల చెక్

నీ అంత చీప్‌గా మేమెందుకు ఆలోచిస్తాం. కాస్తా డిగ్నిఫైడ్‌గానే చేస్తాం అని అపర్ణ పేపర్స్ చదువుతుంది. హుమ్.. పిల్లకాకి ఇది చూపించా నా కోడలిని బెదిరిస్తున్నావ్. మీ అగ్రిమెంట్ పేపర్స్ పట్టుకో ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది అపర్ణ. మళ్లీ వచ్చి 50 లక్షల చెక్. అనుకోకుండా ఏ క్షణాన్నైనా ఉద్యోగం మానేయాల్సి వచ్చినా 25 లక్షలు పెనాల్టీ కడితే చాలని ఈ అగ్రిమెంట్‌లో రాసి ఉంది. పూర్తిగా చదువుకోవే పిల్లకాకి అని అపర్ణ అంటుంది.

దాంతో ఖంగుతిన్న అనామిక పేపర్స్ చదువుతుంది. షభాష్ వదినగారు అని పిల్లకాకికి ఏం తెలుసు పిస్తోలు దెబ్బ అని కనకం అంటుంది. ఇదిగో 50 లక్షల చెక్. దానికి డబుల్ ఇస్తున్నాను అని అపర్ణ అంటుంది. దాంతో కనకం సెటైర్లు వేస్తుంది. మొహం మాడిపోయిందా. పోవే పొడింగి అని కనకం అంటుంది. ఇంటికెళ్లే సరికి నీకు కోర్ట్ నోటీసు వస్తుంది. నీ పెళ్లి టైమ్‌లో నా కొడుకు మీకు 2 కోట్లు ఇచ్చాడు కదా. అవి వెంటనే కట్టాలి. లేకపోతే మీ ముగ్గురుని జైలుకు పంపిస్తాను. గెట్ అవుట్ అని గద్దిస్తుంది అపర్ణ.

దాంతో అవమానంతో వెళ్లిపోతుంది అనామిక. చూశావు కదా. నీ తప్పు లేకపోయినా అనామిక నిన్ను రాజ్ ముందు తప్పు చేసింది. అది పన్నిన వల నుంచి స్వేచ్ఛగా బయటపడ్డావ్. ఇప్పుడు నువ్ చేయాల్సింది వాడి కోపంలో వచ్చిన మాటలను పట్టించుకోకుండా వచ్చి కంపెనీ కోసం పనిచేయి కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేయి అని అపర్ణ అంటుంది. కావ్య ఎంత అదృష్టవంతురాలివే ఏ అత్త ఏ కోడలికి ఇంత చేయదు అని కనకం అంటుంది.

కల్యాణ్ ఫ్యాన్ మూమెంట్

రుద్రాణి, ధాన్యలక్ష్మీ తప్పా ఇంట్లో అందరి సపోర్ట్ నీకే ఉంది. తాతయ్య ఆశీస్సులు కూడా ఉన్నాయి. వచ్చి కంపెనీని నిలబెట్టు అని ఇందిరాదేవి అంటే.. కావ్య ఒప్పకుంటుంది. మరోవైపు కల్యాణ్‌కు కోచింగ్ సెంటర్ నుంచి కాల్ చేస్తుంది. డబ్బు కట్టడం ఇవాళ్టికే లాస్ట్ త్వరగా పే చేయండి అని చెబుతారు. ఇవాళ ఎలాగైనా పే చేస్తాను అని కల్యాణ్ అంటాడు. ఆ పక్కనే ఓ కారు ఆగిపోతుంది. పక్కనే ఉన్న ఆటోలో వెళ్దాం అని కారు డ్రైవ్ చేస్తున్న అతను అంటాడు.

లిరిక్ లక్ష్మీ ఇక్కడ. సరస్వతి పుత్రుడిని ఆటో ఎక్కిస్తారా అని అతను అంటాడు. ప్రొడ్యూసర్‌ను నేను కూడా ఆటో ఎక్కుతాను అని అతను అంటాడు. దాంతో ఇద్దరు కల్యాణ్ ఆటో దగ్గరికి వస్తారు. ఆయన ఫేమస్ లిరిక్ రైటర్ లక్ష్మీ కదా. ఆయనతో ఒక్క ఆటోగ్రాఫ్ ఇప్పిస్తారా అని కల్యాణ్ అంటాడు. సర్ నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను అని కల్యాణ్ అంటే.. ఫ్యానో, ఏసో ఇక్కడ మండిపోతుందు ముందు ఆటో తీయు అని అంటాడు లిరిక్ రైటర్. ఇద్దరిని ఆటోలో తీసుకెళ్తాడు కల్యాణ్.

ఇద్దరు పాట పూర్తి చేయడం గురించి మాట్లాడుకుంటారు. పాట రాయడం అంత ఈజీనా. పదాలు రావాలి. సమయం సందర్భం ఉండాలి అని లక్ష్మీ అంటాడు. మీరు అడగిన లక్షన్నర మీ అకౌంట్‌లోకి పంపించాను అని నిర్మాత అంటాడు. డైరెక్టర్ గారు చెప్పిన పాట సందర్భం ఏంటీ అని లక్ష్మీ అంటాడు. ఇప్పటికీ రెండు సార్లు చెప్పాను అని నిర్మాత అంటే.. ముచ్చటగా మూడోసారి చెప్పండి మూడ్ వస్తుంది అని రైటర్ లక్ష్మీ అంటాడు.

కొత్తగా లేడి బాస్

సీన్ చెబుతాడు నిర్మాత. మీరు చెప్పింది సముద్రం అంతా డెప్త్ ఉంది. ఇప్పటికీ ఇప్పుడు పాట రాదు. రెండురోజులు పడుతుంది అని లక్ష్మీ అంటాడు. ఇద్దరు వాదించుకోవడం కల్యాణ్ వింటాడు. దాంతో కల్యాణ్ పాట పాడుతాడు. దాంతో నిర్మాత ఆశ్చర్యంగా వింటే రైటర్ లక్ష్మీ ఇబ్బంది పడతాడు. పాట పూర్తయ్యేసరికి అడ్రస్ వస్తుంది. చప్పట్లు కొడుతు నిర్మాత దిగుతాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి లిరిక్స్ అని నిర్మాత అంటాడు.

చూశావా. నా ఫ్యాన్ కూడా నా పదాలని ఒంటబట్టించుకున్నాడు చూశారా. అది ఇన్సిపిరేషన్ అంటే అని లక్ష్మీ అంటాడు. ఏదోలే గానీ నా పాట పూర్తి అయింది. ఇదిగో అని డబ్బులు ఇస్తాడు నిర్మాత. మరోవైపు ఈరోజు నుంచి మీ గది అది అని రాజ్‌కు శ్రుతి చెబుతుంది. అది మేనేజర్ రూమ్ నా గది అంటావేంటీ. మరి ఇదెవరిదీ అని రాజ్ అంటాడు. కొత్త బాస్ వచ్చారు సార్. లేడీ బాస్ అని శ్రుతి అంటుంది. ఎవరా బాసినీ అని లోపలికి వెళ్లి కావ్యను చూసి రాజ్ షాక్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024