OTT Korean Drama: తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చిన మరో కొరియన్ రొమాంటిక్ కామెడీ.. రెండు ఓటీటీల్లోకి ఒకేసారి..

Best Web Hosting Provider In India 2024

OTT Korean Drama: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కొరియన్ డ్రామా వచ్చింది. 2017లో వచ్చిన ఈ సిరీస్.. ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ కోసం తెలుగుతోపాటు మరో మూడు భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. కొరియన్ డ్రామాస్ కు ఈ మధ్య క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్ వచ్చింది.

మై సాసీ గర్ల్ ఓటీటీ స్ట్రీమింగ్

తాజాగా ఓటీటీలోకి వచ్చిన కొరియన్ డ్రామా పేరు మై సాసీ గర్ల్ (My Sassy Girl). ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియాతోపాటు ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ కొత్త సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి రెండు ఓటీటీల్లోకి ఈ సిరీస్ రావడం విశేషం.

మై సాసీ గర్ల్ వెబ్ సిరీస్ గురించి..

మై సాసీ గర్ల్ 2017లో వచ్చిన కొరియన్ హిస్టారికల్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. ఇందులో జూ వన్, ఓ యియాన్ సియో, లీ జంగ్ షిన్ నటించారు. 2001లో వచ్చిన సౌత్ కొరియన్ మూవీ మై సాసీ గర్ల్ ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించడం విశేషం.

ఓ స్కాలర్, ఓ యువరాణి మధ్య లవ్ స్టోరీ చుట్టూ తిరిగే కథే ఈ మై సాసీ గర్ల్. మొత్తం 16 ఎపిసోడ్లు ఉండే సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్ ఏకంగా 60 నిమిషాల పాటు ఉంటుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ఉన్నా.. కేవలం కొరియన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళంలోనూ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ లలోకి వచ్చింది.

లేటెస్ట్ కొరియన్ డ్రామాస్

ఇక ఈ మధ్యే తెలుగులోకి మరికొన్ని కొరియన్ డ్రామాస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి రొమాంటిక్ కామెడీ మూవీ కాగా.. మరొకటి డ్రామా వెబ్ సిరీస్. ఈ రెండూ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ లలోనే తెలుగులో స్ట్రీమింగ్ కు రావడం విశేషం. కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ బికాజ్ ఐ లవ్ యూ (Because I Love You) ఇప్పుడు కొరియన్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

మరొకటి వెబ్ సిరీస్ ప్రెట్టీ అగ్లీ. కొరియాలో 2016లో బ్యూటీఫుల్ గాంగ్ షిమ్ పేరుతో స్ట్రీమింగ్ అయిన సిరీస్ ఇది. ఇది ఇద్దరు అక్కచెల్లెళ్ల చుట్టూ తిరిగే బ్యూటీఫుల్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఆ రెండు ఓటీటీల్లోకి కొరియన్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎంఎక్స్ ప్లేయర్ లో ఎవరైనా ఫ్రీగా ఈ సిరీస్ చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో మాత్రం సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024