Best Web Hosting Provider In India 2024
OTT Action Thriller: హాలీవుడ్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వారికి ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు మరో యాక్షన్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మూవీ పేరు ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఐదు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
ఫ్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా అక్టోబర్ 23 నుంచి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది” అనే క్యాప్షన్ తో జియో సినిమా ఈ ట్వీట్ చేసింది.
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ గురించి..
మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఐదో సినిమా ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా. గత సినిమాలను డైరెక్ట్ చేసిన జార్జ్ మిల్లరే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. అయితే ఈ మూవీ ఈ ఫ్రాంఛైజీలోని లీడ్ రోల్ మ్యాక్స్ రాకాటాన్స్కీ గురించి కాకుండా.. మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ మూవీకి ప్రీక్వెల్ గా.. ఫ్యూరీ రోడ్ పాత్ర అయిన ఫ్యూరియోసా ఆరిజిన్ స్టోరీగా తెరకెక్కింది. ఈ ఫ్యూరియోసా పాత్రను ఆన్యా టేలర్ జాయ్ పోషించింది.
ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ ఈ ఏడాది మే 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. 168 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 173.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఐదు నెలల తర్వాత ఇప్పుడు జియో సినిమా ద్వారా ఇండియాలో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఇక్కడి అభిమానులు కూడా ఈ యాక్షన్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.