Best Web Hosting Provider In India 2024
సోనాక్షి సిన్హాకు పెళ్లయ్యాక ఈ ఏడాది తన మొదటి కర్వా చౌత్‌ను నిర్వహించు కుంటోంది. సహ నటుడు జహీర్ ఇక్బాల్‌ను ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకుంది సోనాక్షి. ఈ కర్వా చౌత్ పండుగ ఆమెకు ఎంతో ప్రత్యేకం. భర్త జహీర్ ఇక్బాల్ పట్ల తనకున్న ప్రేమ, నిబద్ధతను సెలబ్రేట్ చేసుకుంటూ సోనాక్షి అందంగా తయారై కర్వాచౌత్ నిర్వహించుకుంది.
అందమైన మంగళసూత్రం
ప్రకాశవంతమైన ఎరుపు చీర, సొగసైన మంగళసూత్రం ధరించి ఉన్న ఫోటోలను సోనాక్షి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. బంగారు మంగళసూత్రంలో వజ్రాలతో కూడిన పూసలుఉన్నాయి. ‘ఈరోజు నేను మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ కర్వా చౌత్ మిస్టర్ భర్త జహీర్ ఇక్బాల్. ప్రేమకు చిహ్నమైన ఈ మంగళసూత్రం మన నిబద్ధతకు చిరస్మరణీయ గుర్తుగా నిలవాలి’ అని తన భావాలను పంచుకుంది.
ఎరుపు రంగు సిల్క్ చీరలో, ఎర్రటి రాళ్లతో అలంకరించిన ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లతో సోనాక్షి అందంగా కనిపించింది. ఎరుపు రంగు బ్లౌజ్ లో సోనాక్షి తన ఫోటోలకు మరింత ఫెస్టివల్ ఫీల్ ను జోడించింది. నలుపు రంగు ఐలైనర్, కాంటూర్ బుగ్గలు, న్యూడ్ షేడ్ లిప్ స్టిక్ లో మినిమమ్ మేకప్ ఎంచుకుంది. నుదుటిపై ఎర్రటి బొట్టు, సింధూరం ధరించి సోనాక్షి కర్వా చౌత్ కోసం సిద్ధంగా కనిపించింది.
మంగళసూత్రం ఖరీదు…
సోనాక్షి వేసుకున్న సొగసైన మంగళసూత్రం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది. పూసలు, వజ్రాలతో నిండిన మంగళసూత్రం కర్వా చౌత్ కు సరైన బహుమతిగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన ఆభరణం ధరను రూ.13,60,000గా ఉంది. దీన్నీ మీరు కూడా కొనుక్కోవచ్చు. బీవీఎల్ జీఏఆర్ ఐ అధికారిక వెబ్ సైట్లో ఇది ఉంది. 18 కేటీ రోజ్ గోల్డ్ కలర్ లో ఓనిక్స్ ఇన్సర్ట్స్, పూసలు, పావే డైమండ్స్ తో కూడిన బంగారు నెక్లెస్ ఇది.
సోనాక్షి సిన్హా గురించి
సోనాక్షి సిన్హా చివరిసారిగా 2024 కామెడీ హారర్ చిత్రం కాకుడాలో కనిపించింది. 2010లో వచ్చిన కామెడీ యాక్షన్ మూవీ దబాంగ్ తో తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోనూసూద్ తదితరులు నటించారు. సోనాక్షి ఈ ఏడాది జూలైలో జహీర్ ఇక్బాల్ ను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సామాజిక వేడుకలో వివాహం చేసుకుంది. నటుడు, జహీర్ తో కలిపి ఆమె 2017 నుంచి డేటింగ్ చేశారు. చివరకు పెద్దలతో అనుమతితో ఆ ఇద్దరూ వివాహం చేసుకున్నారు.