Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
వైయస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారు
పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
బాపట్ల జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణ స్వీకారం
బాపట్ల జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్తేమి కాదని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బాపట్ల జిల్లా ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా ముందుంట: మేరుగు నాగార్జున
తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ముందు తాముంటామని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: శ్యామల
‘కోవిడ్ లాంటి భయంకరమైన విపత్తు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎవరిని యాచించలేదు. కానీ ఎప్పటి ప్రభుత్వం విపత్తు వస్తే ప్రజల నుంచి విరాళాలు యాచించే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం మహిళల భద్రతపైన దృష్టి పెట్టలేదు కానీ మద్యంపైన దృష్టి పెట్టిందని విమర్శలు గుప్పించారు.
కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: లేళ్ల అప్పిరెడ్డి
‘పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కోసం వైయస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలని టార్గెట్ చేసి దాడులు చేసి వేదిస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.