Best Web Hosting Provider In India 2024
AR Rahman Oscars: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ 15 ఏళ్ల కిందట ఆస్కార్ గెలిచిన సంగతి తెలుసు కదా. స్లమ్‌డాగ్ మిలియనీర్ మూవీలో జై హో పాటకుగాను అతడు ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డును అందుకున్నాడు. అయితే ఇప్పుడు దానిని ఎవరు పట్టించుకుంటున్నారంటూ ది వీక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
నా కోసమే పని చేస్తున్నాను
ఏఆర్ రెహమాన్ ఒకప్పుడు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో కోట్లాది మంది అభిమానులు మెచ్చిన ఎన్నో హిట్ సాంగ్స్ అందించిన మ్యూజిక్ కంపోజర్. 1990ల్లో ఓ వెలుగు వెలిగాడు. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీలోని జై హో పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ కూడా అందుకున్నాడు. కానీ ఇప్పుడు దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అతడు అంటున్నాడు.
“నేను చాలా రోజుల కిందటే ఆస్కార్ గెలిచాను. కానీ ఇప్పుడెవరు పట్టించుకుంటున్నారు? అందుకే నా కోసం, నా మనసుకు దగ్గరగా ఉండే పని చేస్తున్నాను. అది భవిష్యత్తు తరాలలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను” అని రెహమాన్ అన్నాడు. ఈ మధ్య కాలంలో రెహమాన్ మ్యూజిక్ చాలా వరకు తగ్గిపోయిన నేపథ్యంలో అతడీ కామెంట్స్ చేశాడు.
ఆ రెండు విషయాలు చిరాకు తెప్పిస్తాయి
ఇక తనకు చిరాకు తెప్పించే రెండు విషయాలు ఏంటో కూడా ఇదే ఇంటర్వ్యూలో రెహమాన్ వెల్లడించాడు. “వయసుతోపాటు నా సహనం కూడా నశిస్తోంది. రెండు విషయాలు నాకు చిరాకు తెప్పిస్తాయి. టైమర్ పెట్టి తీసుకునే సెల్ఫీలు ఒకటైతే.. నేను తప్పుడు నిర్ణయం తీసుకునేలా పురిగొల్పే డైరెక్టర్లు రెండోది.
వాళ్లు మరీ పిచ్చి లిరిక్స్ ఇస్తుంటారు. ఇలాంటి వాటితో నేను స్టేజ్ పై పర్ఫామ్ చేయగలనా అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఒకవేళ సమాధానం నో అయితే.. వద్దని చెప్పేస్తాను” అని రెహమాన్ అన్నాడు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits