NMDC Recruitment : లక్షా ముప్పై వేల వరకు జీతంతో ఎన్ఎండీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం ఇలా

Best Web Hosting Provider In India 2024


జూనియర్ ఆఫీసర్(ట్రైనీ) నియామకం కోసం ఎన్ఎండీసీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nmdc.co.inలో చూసి ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 21 అక్టోబర్ 2024న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 10 నవంబర్ 2024గా ఉంది. కమర్షియల్, ఎన్విరాన్‌మెంట్, జియో అండ్ క్యూసీ, మైనింగ్, సర్వే, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఐఈ, మెకానికల్ విభాగాల్లో మొత్తం 153 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

ఖాళీల వివరాలు

కమర్షియల్ – 4, ఎన్విరాన్‌మెంట్ – 1, జియో అండ్ క్యూసి – 3, మైనింగ్ – 56, సర్వే – 9, కెమికల్ – 4, సివిల్ – 9, ఎలక్ట్రికల్ – 44, ఐఈ – 3, మెకానికల్ – 20 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయాలి. అర్హత ప్రమాణాలు, విద్యా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ఇతర సంబంధిత సమాచారం తెలుసుకోవాలి.

ఎన్ఎండీసీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో రిజిస్ట్రేషన్, ఫారమ్ ఫిల్లింగ్ ఉంటుంది. అభ్యర్థులు ప్రాథమిక వివరాలను పూరించాలి. రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందాలి. ఆపై దరఖాస్తును పూర్తి చేసి అవసరమైన ఫీజులను చెల్లించవచ్చు.

జీతం వివరాలు

మొదటి 12 నెలలు – నెలకు రూ. 37,000గా ఉంటుంది. మిగిలిన 6 నెలలకు నెలకు రూ.38,000 ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత జీతం నెలకు రూ 37000 నుండి రూ 130000 వరకు ఉండనుంది.

దరఖాస్తు విధానం ఇలా

ముందుగా అధికారిక వెబ్‌సైట్ – nmdc.co.inకి వెళ్లండి.

కెరీర్ బటన్‌పై క్లిక్ చేసి, జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) రిక్రూట్‌మెంట్ కోసం ‘ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ నం. 08/2024, తేదీ: 21.10.2024’ లింక్‌పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి అవసరమైన వివరాలను పూరించండి.

రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయండి.

సూచనలను జాగ్రత్తగా చదవండి. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.

దరఖాస్తును సమర్పించిన తర్వాత ఒక ప్రత్యేక సంఖ్య వస్తుంది.

భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయండి.

పూర్తి వివరాల కోసం ఈ పీడీఎఫ్ చూడండి..

Whats_app_banner

టాపిక్

Best Web Hosting Provider In India 2024



Source link