Udupi Sambar: ఉడుపి స్టైల్లో సాంబార్ ఇలా చేశారంటే లొట్టలేసుకొని తింటారు, అన్నం ఇడ్లీలోకి అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

వారానికి ఒక్కసారైనా సాంబార్ కచ్చితంగా ఇంట్లో వండాల్సిందే. దక్షిణ భారతదేశంలో సాంబార్ ఫేమస్ వంటకం. దక్షిణభారతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాంబార్ ను ఒక్కో స్టైల్ లో చేస్తారు. ప్రతి స్టైల్ లోనూ సాంబార్ అదిరిపోవాల్సిందే. ఇక్కడ మేము కర్ణాటక స్టైల్ లో చేసే సాంబార్ రెసిపీ ఇచ్చాము. దీన్ని ఉడిపి సాంబార్ అంటారు. ఈ ఉడిపి సాంబార్ ను వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. దీన్ని ఇడ్లీ దోశలతో తిన్నా రుచిగా ఉంటుంది. ఉడిపి స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో తెలుసుకోండి.

ఉడిపి సాంబార్ రెసిపీకి కావలసిన పదార్థాలు

కందిపప్పు – ఒక కప్పు

పసుపు – ఒక స్పూను

క్యారెట్లు – ఒకటి

మునక్కాయ – ఒకటి

బంగాళదుంప – ఒకటి

సొరకాయ – అర ముక్క

బెండకాయలు – ఆరు

వంకాయలు – రెండు

బీన్స్ – అయిదు

ధనియాలు – ఐదు స్పూన్లు

పచ్చిమిర్చి – రెండు

ఎండుమిర్చి – ఆరు

మెంతులు – ఒక స్పూను

కొబ్బరి ముక్కలు – గుప్పెడు

నూనె – సరిపడినంత

జీలకర్ర – ఒకటిన్నర స్పూను

మినప్పప్పు – రెండు స్పూన్లు

బెల్లం తురుము – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు

చింతపండు – నిమ్మకాయ సైజులో

ఉప్పు – రుచికి సరిపడా

ఉల్లిపాయ – ఒకటి

టమోటాలు – రెండు

కరివేపాకులు – గుప్పెడు

శనగపప్పు – ఒక స్పూను

ఇంగువ – చిటికెడు

ఉడిపి సాంబార్ రెసిపీ

1. కందిపప్పును బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి.

2. ఉడకపెట్టినప్పుడే అందులో పసుపును వేయాలి.

3. ఇప్పుడు సాంబార్ మసాలాను సిద్ధం చేసుకోవాలి.

4. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఒక స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది.

5. ఆ నూనెలో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకులు, ధనియాలు, ఇంగువ వేసి వేయించాలి. వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి లేదా నీళ్ళు పోసి రుబ్బుకోవచ్చు.

6. ఇప్పుడు స్టవ్ మీద సాంబార్ వండేందుకు వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి.

7. అందులో రెండు స్పూన్ల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకులు వేసి వేయించాలి.

8. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి.

9. ఉప్పు, పసుపు చల్లి, పచ్చివాసన పోయేదాకా ఐదు నిమిషాల పాటు వేయించాలి.

10. తర్వాత తగినంత నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి.

11. కూరగాయలు ఉడికాక ముందుగా ఉడికించిన పప్పు సాంబార్ మసాలా పేస్ట్, బెల్లం తురుము, చింతపండు రసము వేసి బాగా కలుపుకోవాలి.

12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. చిన్న మంట మీద పావుగంట సేపు ఉడికించాలి.

13. సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి.

14. ఇందుకోసం మరొక బర్నర్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయాలి.

15. అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించి సాంబార్లో వేసేయాలి.

16. పైన కొత్తిమీరను చల్లి పైన మూత పెట్టేయాలి.

17. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే. టేస్టీ ఉడిపి స్టైల్లో సాంబార్ రెడీ అయినట్టే.

ఉడిపి సాంబార్లో పోషకాలు

ఉడిపి సాంబార్ ఒక్కసారి తిన్నారంటే మీకు సాధారణ సాంబార్ కన్నా ఇది బాగా నచ్చుతుంది. దీనిలో ఎక్కువ పదార్థాలు వేసాం, కాబట్టి పోషకాలు కూడా ఎక్కువగానే అందుతాయి. దీన్ని ఇడ్లీ దోశల్లో తింటే అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని పక్కన బంగాళదుంప ఫ్రై పెట్టుకుంటే ఆ రుచే వేరు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024