OTT Top 5 Releases: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. విభిన్న జానర్ల సినిమాలు, ఓ సిరీస్

Best Web Hosting Provider In India 2024

వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లల్లోకి ఈ వారం (అక్టోబర్ నాలుగో వారం) చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టుబోతున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. అయితే, వీటిలో ఓ ఐదు రిలీజ్‍లు ఎక్కువ ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. విభిన్నమైన జానర్లతో వస్తున్నాయి. సూపర్ హిట్ సత్యం సుందరం చిత్రం ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. ఓ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా అడుగుపెట్టనుంది. ఈ ఐదు రిలీజ్‍లు తెలుగులో ఉండనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

సత్యం సుందరం

తమిళ స్టార్లు కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన మేయళగన్ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో సత్యం సుందరం పేరుతో సెప్టెంబర్ 28న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. తెలుగులోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. సత్యం సుందరం సినిమా ఈ ఆదివారం అక్టోబర్ 27వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ మేయళగన్ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

దో పత్తీ

బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించిన దో పత్తీ చిత్రం నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఈ శుక్రవారం అక్టోబర్ 25న నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, ఇంగ్లిష్‍లోనూ స్ట్రీమింగ్ అవనుంది. దో పత్తీ చిత్రానికి శశాంత చతుర్వేది దర్శకత్వం వహించారు.

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా

హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ అక్టోబర్ 23వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ ఏడాది మేలో ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు అక్టోబర్ 23న జియోసినిమాలో ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా మూవీలో క్రిస్ హేమ్స్‌వర్త్, అన్య టేలర్ జాయ్ లీడ్ రోల్స్ చేయగా.. జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. మ్యాడ్‍మ్యాక్స్ ఫ్రాంచైజీలో ఐదో చిత్రంగా ఈ సినిమా వచ్చింది.

లిటిల్ హార్ట్స్

మలయాళ మూవీ లిటిల్ హార్ట్స్ చిత్రం తెలుగులో అక్టోబర్ 24న ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంలో ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం జూన్‍లో థియేటర్లలో రిలీజ్ అయింది. నాలుగున్నర నెలల తర్వాత తెలుగు డబ్బింగ్‍లో అక్టోబర్ 24న ఆహా ఓటీటీలో అడుగుపెడుతోంది. లిటిల్ హార్ట్స్ మూవీలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలు పోషించగా.. డైరెక్టర్లు జోస్ పెరీరా, అబీ తీసా పౌల్ తెరకెక్కించారు.

ఐంధమ్ వేదం

ఐంధమ్ వేదం వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 25వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంలో రూపొందిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఈ సిరీస్‍లో సాయి ధన్సిక, సంతోశ్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్ లీడ్ రోల్స్ చేశారు. ఈ సిరీస్‍కు నాగా దర్శకత్వం వహించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024