CTET 2024 : సీటెట్ అభ్యర్థులకు అలర్ట్, అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది

Best Web Hosting Provider In India 2024

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET 2024) దరఖాస్తుదారులకు సీబీఎస్ఈ అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తులో మార్పులకు చేసుకునేందుకు కరెక్షన్ విండో ఓపెన్ చేస్తున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌ https://ctet.nic.in/లో ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సీటెట్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 16తో ముగిసింది. తాజాగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులో తెచ్చి..అభ్యర్థులకు తప్పులను సవరించుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 14న సీటెట్ పరీక్షను ఓఎమ్మార్‌ విధానంలో నిర్వహించనున్నారు.

అభ్యర్థులు సీటెట్ అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/ లో లాగిన్ అయ్యి తమ దరఖాస్తులలో మార్పులు చేసుకోవచ్చు. అక్టోబర్ 25 వరకు ఎడిట్ విండో అందుబాటులో ఉంటుందని సీబీఎస్ఈ ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు.. తన పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీలో మార్పులు చేసుకోవచ్చు. వర్గం, వికలాంగుల కేటగిరీ, అలాగే వారు ఎంచుకున్న పేపర్‌1 లేదా పేపర్ II ను సవరించవచ్చు. అభ్యర్థులు పేపర్ 2, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కోసం ఎంచుకున్న భాష, వారి పోస్టల్ చిరునామా, బీఈడీ డిగ్రీ లేదా డిప్లొమాను పొందిన సంస్థ, కళాశాల లేదా విశ్వవిద్యాలయం పేరును మార్చుకోవచ్చు.

సీటెట్ 2024 దరఖాస్తు ఎడిట్ చేయడం ఎలా?

Step 1: CTET అధికారిక వెబ్‌సైట్‌ https://ctet.nic.in/ లింక్ పై క్లిక్ చేయండి.

Step 2: హోమ్‌పేజీలోని కరెక్షన్ విండో లింక్ పై క్లిక్ చేయండి.

Step 3: తర్వాతి పేజీలో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వంటి లాగిన్ వివరాలు నమోదు చేయండి.

Step 4: లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన మార్పులు చేయండి.

Step 5: మీరు చేసిన మార్పులను మరోసారి చూసుకుని సబ్మిట్ పై క్లిక్ చేయండి.

Step 6: భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి.

రెండు పేపర్లు

సీటెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ప్రాథమిక పాఠశాల తరగతులకు(1 నుంచి 5వ తరగతి వరకు బోధించేవారికి), పేపర్-2, 6 నుంచి 8వ తరగతులు బోధించేవారికి సంబంధించినది. అభ్యర్థులు రెండు పేపర్లు రాయవచ్చు. రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు నిర్వహిస్తారు. సీటెట్ పరీక్షను డిసెంబర్ 14న రెండు షిఫ్ట్‌లలో నిర్వహిస్తారు. మార్నింగ్ షిప్టు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఈవినింగ్ షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఉదయం షిఫ్టులో పేపర్-2, ఈవినింగ్ షిఫ్టులో పేపర్-1 నిర్వహిస్తారు.

లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ

సీటెట్​ఎగ్జామ్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఒకసారి అర్హత సాధిస్తే స్కోర్ లైఫ్ లాంగ్​వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను 20 భాషల్లో నిర్వహిస్తున్నారు. సీటెట్ పరీక్షలో వచ్చిన మార్కులు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలల్లో టీచర్ల భర్తీకి పరిగణనలోకి తీసుకుంటారు. ఏపీ, తెలంగాణలోని గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

CtetExamsEducationAndhra Pradesh NewsTelangana News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024