Belly Fat: పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే మ్యాజిక్ టీ ఇదిగో, దీన్ని ప్రతిరోజూ తాగితే నెలలోనే మార్పు కనిపిస్తుంది

Best Web Hosting Provider In India 2024


బరువు పెరగడం అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా కొవ్వు పొట్ట చుట్టూ పేరుకుపోయి అందవిహీనంగా మార్చేస్తోంది. బెల్లీ ఫ్యాట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరిగించుకోవడానికి ఎక్కువమంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు. వ్యాయామాలతో పాటూ ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు. ఇక్కడ మేము బెల్లీ ఫ్యాట్ కరిగించే సెలెరీ టీ గురించి చెప్పాము. దీన్ని ప్రతిరోజూ తాగడం వల్ల కొవ్వు కరిగే అవకాశం ఉంది.

సెలెరీ అంటే ఏమిటి?

సెలెరీ అనేది ఒకరకమైన ఆకుకూర. ఇది కొత్తిమీరలాగే ఉంటుంది. చాలా సూపర్ మార్కెట్లలో ఇది లభిస్తుంది. ఇవి ఆరోగ్యకరమైన ఆకుకూరలు. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. సెలెరీని నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని పాశ్చాత్య దేశాల్లో ఎసిడిటీ నుండి ఉపశమనం పొందడానికి శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

కొవ్వును కరిగించే సెలెరీ

సెలెరీలో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి ఉంటుంది. సెలెరీ టీ తయారుచేసే విధానం, బరువు తగ్గడంలో దాని ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాము. సెలెరీలక్షణాల ఆధారంగా దాని ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సెలెరీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గట్ బ్యాక్టిరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మందగించేలా చేసి కొవ్వు నష్టం జరిగేలా చేస్తుంది. ఆకలిని అరికట్టి ఆహారం అధికంగా తినకుండా అడ్డకుంటుంది. దీని వల్ల కొవ్వును కరగడం మొదలవుతుంది. కాబట్టి కొవ్వును తగ్గించడానికి సెలెరీ అద్భుతంగా పనిచేస్తుంది.

సెలెరీ టీ తయారీ

బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ప్రతి రోజు ఉదయం ఖాళీ పొట్టతో సెలెరీ నీటిని తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. దీన్నే సెలెరీ టీ అంటారు. నీటిలో సెలెరీ కాండాలను వేసి బాగా మరగకాచాలి. ఆ నీటిని వడకట్టి ఆ నీటిలో ఒక స్పూను తేనె వేసి కలుపుకుని తాగాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయం ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

సెలెరీ పానీయాన్ని తాగడం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆర్ధరైటిస్ వంటి ఎముకల వ్యాధుల నుంచి బయటపడేందుకు ఇది ఉపయోగం పడుతుంది. అలాగే శరీరంలో ఉన్న ఇన్ ఫ్లమ్మేషన్ ను తగ్గిస్తుంది. సెలెరీ ఆకులే కాదు సెలెరీ గింజలు కూడా ఇందుకు ఉపయోగపడతాయి. వీటిలో 25 రకాల యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అన్ని రకాలుగా రక్షిస్తాయి.

సెలెరీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి వంటివి ఉంటాయి. అలాగే క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకునే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. సెలెరీలో థాలైడ్ మొక్కల సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ ను అడ్డుకుంటుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని పొట్ట నిండుగా ఉంచుతుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా అడ్డుకుంటుంది. తద్వారా త్వరగా సన్నబడవచ్చు.

Whats_app_banner

Source / Credits

Best Web Hosting Provider In India 2024