25న తీరం దాటనున్న దానా తుపాను.. రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు, సహాయ శిబిరాలకు 10 లక్షల మంది

Best Web Hosting Provider In India 2024


ఈ నెల 25వ తేదీ తెల్లవారు జామున దానా తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా ఉండటంతో విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయించాయి. ఒడిశా ప్రభుత్వం 14 జిల్లాల్లోని 3,000 గ్రామాల నుండి 10 లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని యోచిస్తోంది. రాబోయే తుపాను వల్ల రాష్ట్ర జనాభాలో సగం మంది ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దానా తుపానును ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రైళ్లు రద్దు

దానా తుపాను కారణంగా పలు రైళ్లు రద్దవడంతో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. తిరునల్వేలి జంక్షన్ – షాలిమార్ స్పెషల్ (06087) రైలు ఈ నెల 24న తిరునల్వేలి నుంచి బయలుదేరాల్సి ఉంది. భువనేశ్వర్ నుంచి రామేశ్వరం (రామనాథపురం), భువనేశ్వర్ కు ఈ నెల 25న బయలుదేరాల్సిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు.

దానా తుపాను నేపథ్యంలో ఆగ్నేయ రైల్వే పరిధిలో నడిచే 150కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కామాఖ్య-యశ్వంతపూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్, హౌరా-పూరీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా-భువనేశ్వర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒడిశా మీదుగా వెళ్లే 198 రైళ్లను రద్దు చేసింది.

ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వేగంగా స్పందించేందుకు తమ నౌకలు, విమానాలను సమీకరించామని ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. ఒడిశాలోని పూరీ నుంచి తూర్పు తీరం మొత్తం, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం తీరం మొత్తం దానా తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

సహాయక శిబిరాలు

తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న ఒడిశాలో సహాయక చర్యల్లో ఎమ్మెల్యేలంతా సమన్వయం చేసుకోవాలని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కోరారు. ముంపునకు గురయ్యే ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్లు, ఫ్లడ్ షెల్టర్లు, ఇతర భవనాలను గుర్తించారు. ఆహారం, తాగునీరు, పారిశుధ్యం, ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి తెలిపారు.

స్కూళ్లకు సెలవులు

ఐఎండీ అంచనాల ఆధారంగా ఒడిశా ప్రభుత్వం అంగుల్, పూరీ, నయాగఢ్, ఖోర్ధా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపారా, జాజ్పూర్, భద్రక్, బాలాసోర్, కియోంఝర్, ధెంకనాల్, గంజాం, మయూర్భంజ్ వంటి 14 జిల్లాలను అప్రమత్తం చేసింది. తుపాను నేపథ్యంలో ఒడిశాలోని 14 జిల్లాల్లో ఈ నెల 23 నుంచి 25 వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సహా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్లో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 నుంచి 26 వరకు ఏడు జిల్లాల్లో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్ లతో పాటు తీర ప్రాంతాలు, పశ్చిమ్ మేదినీపూర్, బంకురా, ఝార్గ్రామ్, హుగ్లీ వంటి జిల్లాలు తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఐఎండీ హెచ్చరిక

అక్టోబర్ 23 నుంచి 25 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆ తర్వాత క్రమంగా పెరుగుతాయని హెచ్చరించింది.

పశ్చిమబెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను ఈ నెల 25న తాకే తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కోల్కతా విమానాశ్రయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థను తనిఖీ చేయడంలాంటివి చేస్తున్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source link