Dondakaya Nilava Pachadi: దొండకాయ నిల్వ పచ్చడి ఇలా చేసుకుంటే రెండు నెలల పాటు తినవచ్చు

Best Web Hosting Provider In India 2024


Dondakaya Nilva Pachadi: నిల్వ పచ్చళ్ళు అంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. నిమ్మకాయ నుంచి దబ్బకాయ వరకు ఎన్నో రకాల నిలవ పచ్చళ్ళు ఉన్నాయి. ఇక్కడ మేము దొండకాయ నిల్వ పచ్చడి రెసిపీ ఇచ్చాము. దొండకాయతో వేపుళ్ళు కూరలే కాదు నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. స్పైసీగా చేసుకుంటే రుచి అదిరిపోతుంది. దొండకాయ నిల్వ పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

దొండకాయ నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

దొండకాయలు – అరకిలో

మిరియాల పొడి – మూడు స్పూన్లు

వెల్లుల్లి రెబ్బలు – పదిహేను

ఉప్పు – రుచికి సరిపడా

ఆవాలు – మూడు స్పూన్లు

శనగపప్పు – రెండు స్పూన్లు

జీలకర్ర – అర స్పూను

ఆవాలు – ఒక స్పూను

కారం – అయిదు స్పూన్లు

నూనె – ఒక కప్పు

నిమ్మరసం – మూడు స్పూన్లు

మెంతి గింజలు – అర స్పూను

జీలకర్ర – ఒక స్పూను

దొండకాయ నిల్వ పచ్చడి రెసిపీ

1. దొండకాయలను శుభ్రంగా కడిగి తడి తుడిచి పొడిగా ఉండేలా చూసుకోవాలి.

2. వాటిని నిలువుగా నాలుగు ముక్కలుగా చేసుకోవాలి.

3. ఒక గిన్నెలో కట్ చేసిన దొండకాయ ముక్కలను వేయాలి.

4. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపాలి.

5. జీలకర్ర, మెంతులు కలిపి పొడి చేయాలి.

6. ఆ మెంతుల పొడిని కూడా దొండకాయలు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.

7. మూడు స్పూన్ల ఆవాలను వేయించి పొడి చేసుకోవాలి.

8. ఆ పొడిని కూడా దొండకాయల మిశ్రమంలో వేయాలి. అలాగే నూనెను కూడా వేయాలి.

9. అలాగే మూడు స్పూన్ల నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి.

10. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి మూడు నాలుగు స్పూన్ల నూనె వేయాలి.

11. ఆ నూనెలో ఒక ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి.

12. ఆ తర్వాత దొండకాయల మిశ్రమంలో దీన్ని వేయాలి. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి.

13. ఒక గాజు సీసాలో దొండకాయల మిశ్రమాన్ని వేసి రెండు రోజులు పాటు అలా వదిలేయాలి.

14. రెండు రోజుల తర్వాత స్పూన్ తో కలుపుకోవాలి.

15. ఉప్పు లేదా కారం తక్కువైతే వాటిని మళ్లీ కలుపుకోవచ్చు.

16. అంతే టేస్టీ దొండకాయలా నిల్వ పచ్చడి రెడీ అయినట్టే.

17. దొండకాయలోకి కారం, ఉప్పు, ఆవాల పొడి అన్ని ఇంకి దొండకాయ ముక్క టేస్టీగా తయారవుతుంది.

18. మామిడికాయలాగే దొండకాయ నిలవ పచ్చడి కూడా అదిరిపోతుంది. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.

దొండకాయ ఉపయోగాలు

ఇందులో దొండకాయను మనం పచ్చిగానే తింటాము. కాబట్టి పోషకాలు అన్ని నిండుగా లభిస్తాయి. ఒక దొండకాయలో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్ బి1, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ బి2 నిండుగా ఉంటాయి. కాబట్టి దొండకాయ పచ్చడి తినడం వల్ల ఇవన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు ఈ దొండకాయ నిల్వ పచ్చడిని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే దొండకాయ నిల్వ పచ్చడి తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరిగే అవకాశం కూడా తగ్గిపోతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న వారు కూడా దొండకాయను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గుండె సమస్యలు పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు స్పైసీగా కాకుండా సాధారణ నిల్వ పచ్చడిని తినడం ఉత్తమం. దొండకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటూ ఎన్నో రకాల రోగాలు రాకుండా ఉంటాయి.

Whats_app_banner

Source / Credits

Best Web Hosting Provider In India 2024