The Raja Saab Motion Poster: ది రాజా సాబ్ మోషన్ పోస్టర్‌తో ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది.. మరింత ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్

Best Web Hosting Provider In India 2024

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ నుంచి మోషన్ పోస్టర్ వచ్చింది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (అక్టోబర్ 23) మూవీ టీమ్ దీన్ని తీసుకొచ్చింది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై ఆసక్తి విపరీతంగా ఉంది. మోషన్ పోస్టర్ ద్వారా ప్రభాస్ నయా లుక్ రివీల్ అయింది.

మోషన్ పోస్టర్ వీడియో ఇలా..

దట్టమైన అడవిలో పియానో దానంతటికి అదే మోగుతుండటంతో ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ షురూ అయింది. ఓ వ్యక్తి నడుకుంటూ వెళుతుండగా.. హ్యాపీ బర్త్ డే టూ యూ అనే మ్యూజిక్, హమ్మింగ్ బ్యాక్‍గ్రౌండ్‍లో ఉంది. ఆ వ్యక్తిని దెయ్యం పట్టుకున్నట్టుగా షాట్ ఉంది. ఆ తర్వాత ఓ రాజ భవనం కనిపిస్తుంది. చేతిలోని చుట్టను స్టైలిష్‍గా నోట్లో వేసుకుంటారు ప్రభాస్. సింహాసనంపై రాజసంతో కూర్చొని ఉంటారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో రెబల్ స్టార్ ఉన్నారు. ఆ తర్వాత సింహాసనం తలకిందులు అవుతుంది. ఇలా ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ప్రభాస్ లుక్ డిఫరెంట్‍గా అదిరిపోయింది. ఇంతకు ముందెప్పుడూ కనిపించని లుక్‍లో ప్రభాస్ వావ్ అనేలా ఉన్నారు.

ఈ విషయంపై క్లారిటీ

‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తున్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ మోషన్ పోస్టర్‌తో ఇది నిజమని తెలిసిపోయింది. రాజా సాబ్ నుంచి గతంలో వచ్చిన ఫ్యాన్ ఇండియా గ్లింప్స్, ఇటీవల వచ్చిన పోస్టర్‌లో ప్రభాస్ క్లాసీ లుక్‍తో కనిపించారు. అయితే, ఇప్పుడు వచ్చిన మోషన్ పోస్టర్లో రగెడ్ లుక్‍లో సింహాసనంపై గంభీరంగా ఉన్నారు. పెద్ద జుట్టు, గడ్డంతో కనిపించారు. దీంతో ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని క్లారిటీ వచ్చేసింది.

ది రాజా సాబ్ మూవీలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించడం ఖాయం కావటంతో అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఈ కొత్త లుక్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉందని, క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందోనని కామెంట్లు చేస్తున్నారు. మారుతీ పెద్దగానే ప్లాన్ చేసినట్టున్నారని అంటున్నారు. మొత్తంగా ఈ మోషన్ పోస్టర్‌తో రాజా సాబ్ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.

ది రాజా సాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍తో మెప్పించారు. హారర్ ఫీల్ కలిగేలా బీజీఎం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. రిధి కుమార్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.

ది రాజా సాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. సుమారు రూ.300కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోందని అంచనా. కామెడీ, హారర్, లవ్ స్టోరీతో ఈ మూవీ కథను మారుతీ రాసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024