Dulquer Salman: ఏడాదికి మూడు, నాలుగు వేర్వేరు భాషల సినిమాలు చేయాలనుకుంటున్నా: లక్కీ భాస్కర్ స్టార్ దుల్కర్ సల్మాన్

Best Web Hosting Provider In India 2024

Dulquer Salman: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ జానర్లు, పాత్రలను అన్వేషించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన అతడు.. తాజాగా లక్కీ భాస్కర్ అనే మరో తెలుగు మూవీ కూడా చేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, సూర్య శ్రీనివాస్, రాంకీ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సందర్భంగా బుధవారం (అక్టోబర్ 23) చెన్నైలో మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడాడు.

లక్కీ భాస్కర్ మూవీ గురించి..

లక్కీ భాస్కర్ మూవీ గురించి ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడాడు. “లక్కీ భాస్కర్ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది నిజంగా రిలేటబుల్ కామన్ మ్యాన్ కథ. ఒక పెద్ద కుటుంబంలో డబ్బు సంపాదించే ఏకైక వ్యక్తి అతడు. నేను ఈ పాత్రకు, కుటుంబానికి కనెక్ట్ అయ్యాను” అని దుల్కన్ చెప్పాడు.

ఈ పాత్ర కల్పితమే. కానీ మూడేళ్ల పాటు (1989 నుంచి) జరిగే ఈ కథ నిజజీవిత సంఘటనలు, కుంభకోణాల నుంచి ప్రేరణ పొందింది. దర్శకుడు వెంకీ అట్లూరి చాలా రీసెర్చ్ చేశారని, ఫైనాన్షియల్ టెర్మినాలజీ, బ్యాంకింగ్ ప్రొసీజర్స్ వంటి అంశాలను ఉపయోగించి చాలా చక్కగా తెరకెక్కించారని దుల్కర్ వెల్లడించాడు.

ఇదో గ్రే షేడ్స్ ఉన్న పాత్ర అని, అలాంటి పాత్రలను ఎంచుకోవడం తనకు చాలా ఇష్టమని సీతారామం స్టార్ వెల్లడించాడు. “నాకు గ్రే షేడ్స్ చేయడం ఇష్టం. ఎందుకంటే ఇది మీ సొంత వ్యక్తిత్వానికి భిన్నంగా ఉండే అవకాశం ఇస్తుంది. నటులుగా ఈ పాత్రలు పోషించడం సరదాగా ఉంటుంది.

ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలకు మంచి ఆదరణ ఉంది. ఎవరైనా ఈ నేరాలు చేసినప్పుడు, వారు ఎలా చేశారో అని మనం ఆశ్చర్యపోతాము. ఒక నటుడిగా, నేను అన్ని జానర్లను అన్వేషించడానికి ఇష్టపడతాను. నా దారిలో వచ్చిన వాటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకుంటాను. ప్రామాణికమైన, ఒరిజినల్ కథ ఏదైనా చేస్తాను” అని దుల్కర్ స్పష్టం చేశాడు.

భాషలపై మక్కువ

మలయాళం, తమిళం, తెలుగు, హిందీ ఇలా పలు ఇండస్ట్రీల్లో నటించిన దుల్కర్ ఎక్కడికి వెళ్లినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోగలిగాడు. ‘ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు వేర్వేరు భాషల్లో చేయాలనుకుంటున్నాను. కానీ చాలాసార్లు అది నా చేతుల్లో ఉండదు. గతేడాది నాకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కొంతకాలం నటనకు దూరంగా ఉన్నాను.

తమిళంలో నా తదుపరి మూవీ కాంతా దాదాపు 40 శాతం పూర్తయింది. తమిళ సంస్కృతిని, భాషను చాటిచెప్పే గొప్ప చిత్రమిది. ఆ తర్వాత మరో తమిళం, మలయాళం, తెలుగు సినిమాలు ఉన్నాయి” అని దుల్కర్ అన్నాడు.

లక్కీ భాస్కర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తమిళం అనర్గళంగా మాట్లాడే దుల్కర్ ఈ చిత్రానికి తమిళంలో డబ్బింగ్ చెప్పలేదు. ”డబ్బింగ్ చెప్పడం అంత సులువైనది కాదు. తెలుగులో డబ్బింగ్ చేయడానికి చాలా సమయం పట్టింది. నేను తమిళంలో డబ్బింగ్ చెప్పలేదని చాలా కామెంట్స్ చదివాను, ఇప్పుడు దాని గురించి నొక్కి చెబుతున్నాను – ప్రేక్షకుల్లో ఎవరైనా నిరాశ చెందితే అది నాకు నచ్చదు ఎందుకంటే అది నేను మాట్లాడటం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ తర్వాత తమిళంలో కూడా డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను” దుల్కర్ అన్నాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024