Gunde Ninda Gudi Gantalu: వదినను కొట్టిన బాలు.. మనోజ్‌తో పెద్ద గొడవ.. సత్యానికి గుండెపోటు.. హాస్పిటల్‌కు మీనా!

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఫ్రెండ్స్‌తో కలిసి బాలు తాగుతాడు. మీనాకు కాల్ చేసి తాను కనిపించకపోయాడని చెప్పు. దాంతో మీనా గడగడ వణికిపోతుంది. తర్వాత నాక్ కాల్ చేస్తుంది. నేను కాల్ లిఫ్ట్ చేసి దానిలాగే ఏం మాట్లాడనగా అని బాలు అంటాడు.

తాగి తూలిన బాలు

ఈ రాత్రి కూడా మీ పెళ్లాం మొగుడులా దాగుడు మూతలు ఆడటానికి నేనే దొరికానేంట్రా అని బాలు ఫ్రెండ్ అంటాడు. కట్ చేస్తే బాలు ఇంట్లోని హాల్లో సత్యం, ప్రభావతి ఉంటారు. తలుపుపై పడుతూ తోసుకుంటూ, తూలుతూ బాలు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అది చూసి తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఏంట్రా తాగి వచ్చావా అని సత్యం గద్దిస్తాడు. అప్పుడే మనోజ్, రోహిణి కూడా వస్తారు.

బాలును నిలదీసిన తండ్రి

బాలు మైకంలో ఉంటాడు. ఫుల్‌గా తాగి వచ్చాడు అని మనోజ్ అంటాడు. దాంతో సత్యం షాక్ అవుతాడు. ఎందుకు తాగొచ్చవురా.. ఏం చేశావ్ అని సత్యం వాళ్లు బాలును నిలదీసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆ నలభీమ గాడిని పిచ్చిపిచ్చిగా కొట్టేసి వచ్చాను అని బాలు చెబుతాడు. దాంతో సత్యం, ప్రభావతి షాక్ అయిపోతారు. అలా ఎందుకు కొట్టావ్ అని ప్రభావతి నిలదీసినట్లుగా తెలుస్తోంది.

లేచిపోవాలనే కదా

బాలు చేసింది కరెక్ట్ అని మనోజ్ వాదిస్తాడు. రవిగాడి వల్ల వీధుల్లో నడవాలంటే చాలా అవమానంగా ఉందమ్మా అని మనోజ్ అంటాడు. నువ్ కూడా ఒకదాంతో లేచిపోవాలనే కదా 40 లక్షలు ఎత్తుకుని పారిపోయింది అని బాలు అంటాడు. మనోజ్ పరువును బాలు అలా తీయడంతో మనోజ్ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. ఇద్దరు గొడవపడతారు.

బాలు, మనోజ్ గొడవ

గొడవ పడే క్రమంలో బాలును పక్కకు తోసేస్తాడు మనోజ్. పోరా అవతలికి అని బాలును తోసేస్తాడు మనోజ్. దాంతో టీపాయ్‌పై పడిపోతాడు బాలు. అయ్యో అని ప్రభావతి అంటుంది. తర్వాత లేచిన బాలు వెళ్లి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. బాలు, మనోజ్ ఒకరినొకరు కాలర్ పట్టుకుని లాక్కుంటారు. రేయ్ రేయ్ అని సత్యం అరుస్తుంటాడు. అయినా కానీ, బాలు, మనోజ్ వినరు.

రోహిణిని కొట్టిన బాలు

రోహిణి, ప్రభావతి, మౌనిక అన్నదమ్ములను ఆపేందుకు ప్రయత్నిస్తుంటారు. వదులు బాలు వదులు అని రోహిణి మొత్తుకుంటుంది. ఇంతలో ఆ ఆవేశంలో మనోజ్‌ను లాగి పెట్టి కొడతాడు బాలు. అంతేకాకుండా మనోజ్ భార్య తనకు వదిన అయిన రోహిణి చెంపపై కొడతాడు బాలు. దాంతో మౌనిక, మనోజ్, సత్యం, ప్రభావతి అంతా షాక్ అవుతారు.

ఉలిక్కిపడిన మీనా

అసలు నిన్ను నేను అని సత్యం అరుస్తూ ఒక్కసారిగా గుండె పట్టుకుంటాడు. సోఫాపై కుప్పకూలిపోతాడు సత్యం. దాంతో అంతా షాక్ అయి సత్యం దగ్గరికి చేరుతారు. ఏవండి.. ఏవండి అంటూ ప్రభావతి కంగారుపడుతుంది. మరోవైపు నిద్రలో నుంచి అమ్మా అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది మీనా. ఏమైంది అని సుమతి అడుగుతుంటే మీనా ఏం చెప్పదు.

హాస్పిటల్‌కు మీనా

ఏమైంది మీనా అని పార్వతి అడుగుతుంది. అయితే, సత్యంకు గుండెపోటు రావడం మీనాకు కల వచ్చినట్లుగా తెలుస్తోంది. భర్త బాలుకు మీనా కాల్ చేసి విషయం అడుగుతుందని అర్థం అవుతోంది. మరోవైపు సత్యంను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఆ హాస్పిటల్‌కు మీనా వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే, తండ్రి హార్ట్ ఎటాక్ గురించి తెలుసుకున్న రవి కూడా ఆసుపత్రికి వెళ్లే ఛాన్స్ ఉంది. అలా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024