Camphor: మీరు వాడే కర్పూరం స్వచ్ఛమైంది కాకపోతే సమస్యలే, ఇలా స్వచ్ఛత తెల్సుకోండి

Best Web Hosting Provider In India 2024

పూజ సమయంలో వెలిగించే కర్పూరం వాసనతో ఆధ్మాత్మిక భావనతో పాటే సానుకూల వాతావరణం పెరుగుతుంది. కర్పూరం వాసన ఇంట్లోని నెగటివిటీని దూరం చేస్తుందంటారు. బ్యాక్టీరియాను కూడా తొలిగిస్తుందిది. అయితే నకిలీ కర్పూరం వాడితే ఈ ప్రయోజనాలు రావు. కాబట్టి మీరు వాడే కర్పూరం స్వచ్ఛత తప్పకుండా తెల్సుకోవాల్సిందే. అసలు నకిలీ కర్పూరానికి, కల్తీ లేని కర్పూరానికి తేడా ఏముంటుందో తెల్సుకుందాం.

కర్పూరం రంగు:

నకిలీ కర్పూరం రంగు తెల్లగా మెరిసిపోదు. కాస్త లేత గోధుమ రంగులో లేదా కొద్దిగా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈ రంగు కోసం, కర్పూరంలో సఫ్రోల్ అనే పదార్థం కలుపుతారు. ఇలా కల్తీ చేసిన కర్పూరాన్ని కాల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటులో హెచ్చుతగ్గులు, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

వాసన:

నకిలీ కర్పూరం వాసన చూస్తే కాస్త కోల్డ్ రిలీఫ్ బామ్ లాంటి వాసన రావచ్చు. అలాగే కర్పూరం వాసన చూస్తున్నప్పుడు దురద, ముక్కులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది నకిలీ కర్పూరం అని తెల్సుకోవచ్చు.

నిజమైన కర్పూరం ఇలా గుర్తించండి:

  • నిజమైన కర్పూరం పూర్తిగా స్వచ్ఛంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది.
  • నిజమైన కర్పూరం కాల్చినప్పుడు, అది కాలిపోయాక ఎటువంటి అవశేషాలు మిగలవు. కర్పూరం కాల్చేటప్పుడు కింద బూడిద మిగిలితే, అది పూర్తిగా నకిలీ కర్పూరం. నిజమైన కర్పూరం సులభంగా కరిగిపోతుంది
  • అసలు కర్పూరం పూర్తిగా మండిపోటానికి కనీసం కాస్త సమయం తీసుకుంటుంది. నకిలీ కర్పూరం తొందరగా మండిపోతుంది.
  • నిజమైన కర్పూరం కాల్చినప్పుడు ఇది తేలికపాటి మంచి సువాసన కలిగిన నల్లని పొగను విడుదల చేస్తుంది. కల్తీ చేసిన కర్పూరం జ్వాల నారింజ రంగులో కనిపిస్తుంది.
  • కర్పూరాన్ని నీటిలో వేస్తే అది అడుగున చేరుతుంది. స్వచ్ఛమైన కర్పూరం బరువుగా ఉండటమే దానికి కారణం. అలా కాకుండా నీటి మీద తేలితే కల్తీ అన్నట్లు గుర్తించండి.
  • అసలైన కర్పూరం ఎల్లప్పుడూ చెట్టు ఆకుల నుండి తయారు చేస్తారు. చెట్టు బెరడు నీటి నుంచి నకిలీ కర్పూరం తయారు చేస్తారు. మీరు కొనేటప్పుడు ఈ విషయం ఓసారి గమనించండి. కర్పూరం సుగుణాలు దాని ఆకుల నుంచే వస్తాయి.

 

 

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024