Bigg Boss Telugu 8 Prize Money: విష్ణుప్రియ వల్ల పెరిగిన బిగ్ బాస్ ప్రైజ్ మనీ.. ఇప్పుడు విజేతకు ఎంత డబ్బు వస్తుందంటే?

Best Web Hosting Provider In India 2024

Bigg Boss Telugu 8 Winner Prize Money: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ జోరుగా సాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లోకి ముందు 14 మంది కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కొంతమంది ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ప్రస్తుతం హౌజ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

అన్‌లిమిటెడ్ ప్రైజ్ మనీ

హౌజ్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్లలో నిఖిల్, నబీల్, పృథ్వీరాజ్, యష్మీ గౌడ, విష్ణుప్రియ, ప్రేరణ కంబం, మెహబూబ్, నయని పావని, హరితేజ, రోహిణి, గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారు. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయింది. అంటే అన్‌లిమిటెడ్ ఫన్, అన్‌లిమిటెడ్ ట్విస్టులతోపాటు అన్‌లిమిటెడ్ ప్రైజ్ మనీ అని హోస్ట్ నాగార్జున చెప్పారు.

ఆట తీరును బట్టి డబ్బు

ఇంతకుముందు బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దాదాపుగా రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీగా వచ్చేది. కానీ, బిగ్ బాస్ తెలుగు 8లో మాత్రం కంటెస్టెంట్ల ఆట తీరును బట్టి ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు. అంటే, కంటెస్టెంట్స్ ఎంత సంపాదించుకుంటే అంతగా బిగ్ బాస్ 8 తెలుగు విజేత ప్రైజ్ మనీ ఉంటుంది.

ఆరుగురు మధ్య పోటీ

ఈ ప్రైజ్ మనీకి తాజాగా కొంత డబ్బు యాడ్ అయింది. అది యాంకర్ విష్ణుప్రియ ద్వారా. బిగ్ బాస్ తెలుగు 8 అక్టోబర్ 26 ఎపిసోడ్‌లో ఆరుగురు కంటెస్టెంట్ల మధ్య తొమ్మిదో వారానికి సంబంధించిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ జరిగింది. మెగా చీఫ్ కంటెండర్ టాస్క్‌లో ఓజీ క్లాన్ నుంచి నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ నలుగురు సెలెక్ట్ అయింతే.. రాయల్ టీమ్ నుంచి టేస్టీ తేజ, రోహిణి ఇద్దరు ఎంపిక అయ్యారు.

తొమ్మిదో వారం మెగా చీఫ్‌గా

వీరిలో ఎవరు మెగా చీఫ్ కావొద్దని అనుకుంటున్నారో వారికి మిరపకాయల దండ వేసి టాస్క్ నుంచి పంపించే అవకాశాన్ని మిగతా కంటెస్టెంట్స్‌కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ప్రాసెస్‌లో చివరిగా ఎలాంటి మిరపకాయల దండ పడకుండా బిగ్ బాస్ తెలుగు 9 తొమ్మిదో వారానికి మెగా చీఫ్ అయింది యాంకర్ విష్ణుప్రియ.

ఎన్వలప్‌లో 2 లక్షలు

అయితే, ఈ మెగా చీఫ్ టాస్క్‌కు ముందు ఆరుగురు కంటెండర్స్‌కు వారి పేరుతో ఒక ఎన్వలప్ ఇచ్చారు. ఎవరు మెగా చీఫ్ అయితే వారి పేరున్న ఎన్వలప్ ఓపెన్ చేయాలని బిగ్ బాస్ తెలిపాడు. దాంతో విష్ణుప్రయ తన పేరున్న ఎన్వలప్ ఓపెన్ చేసింది. అందులో రూ. 2 లక్షలు రాసి ఉంది. ఆ రెండు లక్షల రూపాయలు బిగ్ బాస్ తెలుగు 8 విజేత ప్రైజ్ మనీలో యాడ్ అవుతుందని బిగ్ బాస్ వెల్లడించాడు.

ప్రస్తుతం బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇదే

విష్ణుప్రియ మెగా చీఫ్ కావడంతో బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ప్రైజ్ మనీ ఇంకాస్తా పెరిగింది. దాంతో ఇప్పటికీ బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 40,16000 కు చేరుకుంది. అంటే, ఈ సీజన్ విన్నర్‌గా నిలిచిన విజేతకు ఇప్పటికీ అయితే 40 లక్షల 16 వేల రూపాయల డబ్బు వస్తుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024