TGSRTC Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్శిళ్లు ఇంటి వద్దకే, రేపటి నుంచి హోండెలివరీ సర్వీసులు ప్రారంభం

Best Web Hosting Provider In India 2024


తెలంగాణ ఆర్టీసీ ఇంటి వద్దకే కార్గో సేవలు అందించాలని నిర్ణయించింది. కార్గో సేవల్లో వచ్చిన పార్శిళ్లను హోం డెలివరీ చేయనుంది. హైద‌రాబాద్ లో పార్శిళ్ల హోం డెలివ‌రీని ఫైల‌ట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనుంది. రేపటి నుంచి హోండెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.

త్వర‌లోనే రాష్ట్రవ్యాప్తంగా హోం డెలివ‌రీ సేవ‌లు ప్రారంభిస్తామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ సామాజిక మధ్యమంలో ట్వీట్ చేశారు.

పార్శిళ్ల హోం డెలివ‌రీ ఛార్జీలిలా

  • 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు ఛార్జీ రూ.50
  • 1.01 నుంచి 5 కేజీల‌ వరకు రూ.60
  • 5.01 నుంచి 10 కేజీల‌ వరకు రూ.65
  • 10.1 నుంచి 20 కేజీల‌ వరకు రూ.70
  • 20.1 నుంచి 30 కేజీల‌ వరకు రూ.75
  • 30.1 కేజీలు దాటితే పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు నిర్ణయించనున్నారు.

హైదరాబాద్ లోని 31 ప్రాంతాల్లో

ఇంటి వ‌ద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవ‌లను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు. హైద‌రాబాద్లో పైల‌ట్ ప్రాజెక్ట్‌గా పార్శిళ్ల హోండెలివ‌రీని రేప‌టి నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా హోండెలివ‌రీ సేవ‌లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీజీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కార్గో సేవ‌ల‌ను మ‌రింత‌గా పటిష్టం చేయనుంది. అందుకే హైద‌రాబాద్లో వేగ‌వంత‌మైన కార్గో సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

అక్టోబర్ 27 నుంచి హైద‌రాబాద్లోని 31 ప్రాంతాలలో హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ వివ‌రించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల నుంచి హైద‌రాబాద్లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ చేయనున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచే ఆర్టీసీ కార్గో సేవలు అందించేలా టీజీఎస్ఆర్టీసీ ప్రణాళిక అభివృద్ది చేస్తు్ందన్నారు. హైదరాబాద్ నగరవాసులు హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TsrtcTelangana NewsHyderabadTrending TelanganaTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024